మూడు నెలల్లో... రూ. 1,897 కోట్లు లాభం

ABN , First Publish Date - 2021-07-23T01:03:39+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభంలో 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది.

మూడు నెలల్లో... రూ. 1,897 కోట్లు లాభం

ముంబై :  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభంలో 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 2,100 కోట్లు. గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 1,897 కోట్లు. జూన్ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 13.21 శాతం పెరిగి రూ. 11,966 కోట్లకు చేరుకున్నాయని హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.


కాగా... గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 10,570 కోట్లు అన్న విషయం తెలిసిందే. ఇక... 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెచ్‌యూఎల్ మొత్తం వ్యయం రూ.9, 546 కోట్లు. అంటే... 14.68 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ మొత్తం వ్యయం రూ. 8,324 కోట్లు. 

Updated Date - 2021-07-23T01:03:39+05:30 IST