రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

ABN , First Publish Date - 2021-10-18T04:48:20+05:30 IST

జడ్చర్లలో శనివారం కురిసిన భారీ వర్షానికి నాలాలో పడికొట్టుకొని పోయి మృతిచెందిన రాఘవేందర్‌ కుటుంబా నికి రూ.20 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్‌ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వ య కర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
వర్షానికి తడిసిన బియ్యాన్ని చూపిస్తున్న బాధితులు


- కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

-  మృతి చెందిన రాఘవేందర్‌ కుటుంబానికి పరామర్శ

- లోతట్టు ప్రాంతాల పరిశీలన


జడ్చర్ల, అక్టోబరు 17 : జడ్చర్లలో శనివారం కురిసిన భారీ వర్షానికి నాలాలో పడికొట్టుకొని పోయి మృతిచెందిన రాఘవేందర్‌ కుటుంబా నికి రూ.20 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్‌ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వ య కర్త జనంపల్లి అనిరుధ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జడ్చర్లలోని శివాజీనగర్‌ కాలనీలోని రాఘవేందర్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాఘవేందర్‌ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జడ్చర్లను సుందరీకరణ, అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న అఽధికార పార్టీ నాయకులు ఓ నిరుపేద వ్యక్తి మృతి చెందిన సంఘటనకు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. జడ్చర్ల మునిసిపల్‌ పరిధిలో మురుగు కాల్వలు సక్రమంగా లేవని ఆరోపిం చారు. పట్ట ణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీ, శివాజీనగర్‌ కాలనీ, త్రిషూల్‌నగర్‌, తదితర లోత ట్టు కాలనీలను పరిశీలించారు. గంగాపూర్‌ వెళ్లే దారిలో నూతనంగా నిర్మిస్తు న్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ దశలోనే నీటిలో మునిగిపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు పడవను కొని ఆసుపత్రికిపోయో పరిస్థితులు వచ్చాయని ఆయన ధ్వజమెత్తారు. గండిపడిన నల్లకుంట చెరువును పరిశీలించారు. నాణ్యతలేని పనులు చేపడితే ఇలాగే ఉంటుంద ని ఆయన ఎద్దేవాచేశారు. జడ్చర్ల పట్టణానికి తక్షణమే మాస్టర్‌ ప్లాన్‌ ప్రకటిం చాలని, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ మంజూరి చేయాలని కోరారు. ప్రజాప్రతిని ధులు, నాయకులు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం, భూ కబ్జాలు, అక్రమ దందాల వెంట పరుగులు పెడుతున్నారని మండిపడ్డారు. ఆసుపత్రికి పక్షం రోజుల్లో రోడ్డు, ఇతర అన్ని వసతులపై క్లారిటీ ఇవ్వాలని, లేని ఎడల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుర్తి రోడ్డుపై బైఠాయిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నిత్యానందం, మినాజ్‌, ఖాజ, నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-18T04:48:20+05:30 IST