ఏపీకి అదనంగా రూ. 2,655 కోట్ల రుణాలకు కేంద్రం అనుమతి

ABN , First Publish Date - 2021-09-14T21:08:10+05:30 IST

న్యూఢిల్లీ: మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు అదనపు రుణాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

ఏపీకి అదనంగా రూ. 2,655 కోట్ల రుణాలకు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ: మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు అదనపు రుణాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 11 రాష్ట్రాలకు రూ. 15,721 కోట్ల రుణాలు పొందేందుకు అనుమతి ఇచ్చింది. ఏపీకి అదనంగా రూ. 2,655కోట్ల రుణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరం..తొలి త్రైమాసికంగానూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్న 11 రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్‌లో అదనంగా రుణాలు పొందేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఏపీతోపాటు బీహార్, ఛత్తీస్‌గఢ్, హరియాణ, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, రాజస్థాన్, ఉత్తరఖండ్.. ఈ 11 రాష్ట్రాలకు రూ. 15,721 కోట్ల రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అనుమతి ఇచ్చింది.

Updated Date - 2021-09-14T21:08:10+05:30 IST