రూ.32.49 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-01-01T06:45:54+05:30 IST

కరోనా సంక్షోభ సంవత్సరంలోనూ స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద రూ.32.49 లక్షల కోట్లు పెరిగింది. డిసెంబరు 31న ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.

రూ.32.49 లక్షల కోట్లు

2020లో పెరిగిన స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద 

ఏడాదిలో 15ు వృద్ధి చెందిన ప్రామాణిక సూచీలు 

రూ.1.66 లక్షల కోట్లు 2020లో భారత ఈక్విటీల్లోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు 

రూ.1,88,03,518.60 కోట్లు

 డిసెంబరు 31న ట్రేడింగ్‌ ముగిసేనాటికి 

 బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 


ముంబై: కరోనా సంక్షోభ సంవత్సరంలోనూ స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద రూ.32.49 లక్షల కోట్లు పెరిగింది. డిసెంబరు 31న ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.188 లక్షల కోట్ల ఎగువకు చేరుకుంది. ఈ ఏడాది కాలంలో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 6,497 పాయింట్లు (15.7 శాతం), ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 1,813 పాయింట్లు (14.90 శాతం) పుంజుకున్నాయి. ప్రధాన కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లు మెరుగైన రిటర్నులు పంచాయి. గడిచిన 12 నెలల్లో బీఎ్‌సఈ స్మాల్‌ క్యాప్‌ సూచీ 32 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 20 శాతం మేర వృద్ధి చెందాయి. బీఎ్‌సఈ 500 సైతం 17 శాతం ఎగబాకింది. మరిన్ని విషయాలు.. 


22017 తర్వాత ప్రామాణిక సూచీలకిదే అత్యుత్తమ వృద్ధి. ఆ ఏడాదిలో సెన్సెక్స్‌ 29.58 శాతం, నిఫ్టీ 30.28 శాతం పెరిగాయి. 

కరోనా కాటుకు ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 40 శాతం క్షీణించింది.  మార్చి నాటి కనిష్ఠ స్థాయిలతో పోలిస్తే సూచీ మళ్లీ 86 శాతం ఎగబాకింది. 

ఈ ఏడాదిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)లు మన ఈక్విటీ మార్కెట్లో 2,240 కోట్ల డాలర్ల (రూ.1.66 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టారు. అందులో రూ.1.18 లక్షల కోట్లు గడిచిన రెండు నెలల్లోనే ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం. 

నిఫ్టీ లిస్టెడ్‌ కంపెనీల్లో దివీస్‌ లేబొరేటరీస్‌ 106 శాతం వృద్ధితో అత్యుత్తమ రిటర్నులు పంచిన షేరుగా నిలిచింది. 2020 సెప్టెంబరులోనే దివీ్‌సను నిఫ్టీలో చేర్చారు. 


రంగాలవారీగా చూస్తే.. నిఫ్టీ ఐటీ 55 శాతం, ఫార్మా 59 శాతం వృద్ధి చెందాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా, మెటల్‌ సూచీలు 11-15 శాతం మేర పుంజుకున్నాయి. 

2బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ 2.5 శాతం తగ్గింది. అందులో ప్రైవేట్‌ బ్యాంకుల సూచీ 3 శాతం, ప్రభుత్వ బ్యాంకుల సూచీ ఏకంగా 30 శాతం తగ్గాయి. 


సూచీల వృద్ధి (%) 

బీఎ్‌సఈ సెన్సెక్స్‌        15.75

ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ         14.90

బీఎ్‌సఈ 500          17.00

బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌     32.00

బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌      20.00


సెన్సెక్స్‌ కంపెనీల్లో టాప్‌-5 గెయినర్స్‌ 

కంపెనీ                                ప్రస్తుత షేరు ధర      2020లో వృద్ధి  

                        (రూ.లలో)       (శాతం)

డాక్టర్‌ రెడ్డీస్‌ 5,204.10 80.9

ఇన్ఫోసిస్‌ 1,255.85 71.6

హెచ్‌సీఎల్‌ టెక్‌ 945.95 66.5

ఏషియన్‌ పెయింట్స్‌ 2,764.45 54.7

సన్‌ఫార్మా 592.35 37.0


టాప్‌ లూజర్స్‌                                  క్షీణత శాతం 

ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 894.95 - 40.8

ఓఎన్‌జీసీ 93.20 - 27.6

యాక్సిస్‌ బ్యాంక్‌ 620.35 - 17.7

ఎస్‌బీఐ 274.75 - 17.7

ఎన్‌టీపీసీ 99.30 - 16.6



నిఫ్టీ @14,000


ఏడాది చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో సరికొత్త మైలురాయికి సూచీ 


ఏడాది చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో తీవ్ర ఊగిసలాటలకు లోనైన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. 2020కి మిశ్రమంగా ముగింపు పలికాయి. కాకపోతే, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ తొలిసారిగా 14,000 మైలురాయిని తాకింది. 14,024.85 వద్ద సరికొత్త జీవితకాల ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. చివర్లో మాత్రం 0.20 పాయింట్ల నష్టంతో 13,981.75 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ సైతం 47,896.97 వద్ద ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసుకున్నప్పటికీ.. ట్రేడింగ్‌ ముగిసేసరికి కేవలం 5.11 పాయింట్ల లాభంతో 47,751.33 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో హెచ్‌డీఎ్‌ఫసీ 1.65 శాతం పెరుగుదలతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ కూడా ఒక శాతానికి పైగా పెరిగాయి. టీసీఎస్‌, అలా్ట్రటెక్‌ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు మాత్రం ఒక శాతానికిపైగా నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే.. బీఎ్‌సఈలోని రియల్టీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, మెటల్‌, హెల్త్‌కేర్‌ సూచీలు 1.18 శాతం వరకు పెరిగాయి. టెలికాం, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ సూచీలు మాత్రం నష్టాలు చవిచూశాయి. చిన్న, మధ్య స్థాయి కంపెనీలతో కూడిన బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లు 0.36 శాతం వరకు పెరుగుదలతో సరిపెట్టుకున్నాయి. 



2021లో 50,000కు సెన్సెక్స్‌ 


కొత్త ఏడాదిలో మార్కెట్లను ప్రభావితం చేసే కీలకాంశాలు.. 

 2021-22 బడ్జెట్‌ నిర్ణయాలు 

 కరోనా వ్యాప్తి పరిణామాలు 

 కొవిడ్‌ టీకా కార్యక్రమంలో పురోగతి 

 అమెరికా సహా అగ్రరాజ్యాల ఉద్దీపన ప్యాకేజీలు 

 బ్రెగ్జిట్‌, అంతర్జాతీయ వాణిజ్య పునరుద్ధరణ 

 వర్షపాతం, వ్యవసాయ రంగ పనితీరు 


కొత్త సంవత్సరంలోనూ స్టాక్‌ మార్కెట్ల జోరు కొనసాగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధి పునరుద్ధరణతోపాటు విదేశీ, రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు నిలకడగా కొనసాగితే 2021లోనూ సెన్సెక్స్‌, నిఫ్టీ రెండంకెల వృద్ధి కనబర్చవచ్చని ఈక్విటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుసగా 9 నెలలుగా మార్కెట్లో బుల్‌ ర్యాలీ కొనసాగుతోంది.

కాబట్టి ఏడాది తొలినాళ్లలో సూచీలు కొంత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, మార్కెట్‌ తిరిగి కోలుకుని సెన్సెక్స్‌ 50,000, నిఫ్టీ 15,000 మైలురాళ్ల దిశగా దూసుకెళ్లనున్నాయని మార్కెట్‌ పండితులు జోస్యం చెబుతున్నారు.


Updated Date - 2021-01-01T06:45:54+05:30 IST