రూ.444 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2020-09-24T06:11:07+05:30 IST

కోవిడ్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ సంవత్సరం భారీగానే దెబ్బతీస్తోంది. దీంతో ఈ సంవతత్సరం వస్తు, సేవల ఉత్పత్తి ఆరు లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.444 లక్షల కోట్లు) మేర పడిపోతుందని అంచనా.

రూ.444 లక్షల కోట్లు

ప్రపంచానికి కొవిడ్‌ నష్టం: అంక్టాడ్‌

-5.9 శాతానికి భారత జీడీపీ వృద్ధి


న్యూయార్క్‌: కోవిడ్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ సంవత్సరం భారీగానే దెబ్బతీస్తోంది. దీంతో ఈ సంవతత్సరం వస్తు, సేవల ఉత్పత్తి ఆరు లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.444 లక్షల కోట్లు)  మేర పడిపోతుందని అంచనా. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అంక్టాడ్‌ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. ఈ మహమ్మారితో ఈ సంవత్సరం భారత జీడీపీకి -5.9 శాతం కోత పడుతుందని తెలిపింది. పరిస్థితులు కుదుటపడితే వచ్చే ఏడాది భారత జీడీపీ 3.9 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. చైనా తప్ప, అమెరికాతో సహా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకూ ఈ సంవత్సరం కోవిడ్‌ పోటు తప్పదని స్పష్టం చేసింది. కోవిడ్‌తో ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యాన్ని అంక్టాడ్‌ 1930 నాటి మహా ఆర్థిక మాంద్యంతో పోల్చింది. కోవిడ్‌ సద్దుమణిగినా వచ్చే ఏడాది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ‘వీ’ షేప్‌ రికవరీ ఉండదని తెలిపింది. అలా జరగాలంటే  ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు రెండంకెల్లో  ఉండాలని గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదని అంక్టాడ్‌ అంచనా.

Updated Date - 2020-09-24T06:11:07+05:30 IST