రూ. 5 లక్షల కోట్లు ఆవిరి

ABN , First Publish Date - 2022-09-24T08:13:44+05:30 IST

అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను భారీగా పెంచడంతో పాటు ఆర్థిక మాంద్యం భయాలు ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ వర్గాలను బెంబే లెత్తించాయి.

రూ. 5  లక్షల కోట్లు ఆవిరి

 స్టాక్‌ మార్కెట్లకు వడ్డీ రేట్ల పోటు..  సెన్సెక్స్‌ 1,020 పాయింట్లు పతనం 

17,400 దిగువకు  నిఫ్టీ

పవర్‌, రియల్టీ, బ్యాంకింగ్‌ షేర్లపై ఒత్తిడి 

ఈ ఏడాది సూచీల లాభాలన్నీ స్వాహా


ముంబై: అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను భారీగా పెంచడంతో పాటు ఆర్థిక మాంద్యం భయాలు ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌ వర్గాలను బెంబే లెత్తించాయి. ఇన్వెస్టర్ల అమ్మకాల హోరులో భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు కూడా భారీ పతనాన్ని చవిచూశాయి. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు సూచీలు నమోదు చేసిన లాభా లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వారాంతం (శుక్రవారం) ట్రేడింగ్‌ ముగిసేసరికి, బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 1,020.80 పాయింట్లు (1.7ు) క్షీణించి 58,098.92 వద్దకు జారుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 302.45 పాయింట్లు (1.72ు) తగ్గి 17,327.35 వద్ద స్థిరపడింది. కాగా, బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 2.28 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.92 శాతం నష్టపోయాయి. దాంతో స్టాక్‌ మార్కెట్‌ సంపద రూ.4.90 లక్షల కోట్లకు పైగా తరిగి రూ.276.64 లక్షల కోట్లకు పడిపోయింది. మార్కెట్‌ సూచీ లు నష్టపోవడం వరుసగా ఇది మూడో రోజు. గడిచిన 3 ట్రేడిం గ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,620.82 పాయింట్లు కోల్పోగా.. రూ.6.78 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరైపోయింది. 


సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 27 నేలచూపులే చూశాయి. ప్రభుత్వ రంగ పవర్‌గ్రిడ్‌ షేరు 7.93 శాతం పతనమై సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్‌బీఐ 3 శాతం క్షీణించగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎ్‌ఫసీ, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 2 శాతానికి పైగా మార్కెట్‌ విలువను కోల్పోయాయి. కాగా, సన్‌ఫార్మా షేరు అత్యధికంగా 1.53 శాతం పుంజుకోగా.. టాటా స్టీల్‌, ఐటీసీ స్వల్ప లాభాల్లో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే, బీఎ్‌సఈలోని యుటిలిటీ సూచీ ఏకంగా 3.48 శాతం పడిపోగా.. పవర్‌ 3.40 శాతం, రియల్టీ 2.97 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 2.56 శాతం, టెలికాం 2.17 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 2.06 శాతం తగ్గాయి. 


90 డాలర్ల దిగువకు బ్రెంట్‌ క్రూడ్‌ 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు బ్యారెల్‌ ఽధర శుక్రవారం ఒక దశలో 4.5 శాతం తగ్గి 86.32 డాలర్లకు పడిపోయింది. కాగా, వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ (డబ్ల్యూటీఐ) క్రూడ్‌ ధర 5.27 శాతం క్షీణించి 79.26 డాలర్లకు దిగివచ్చింది. ఆర్థిక మాంద్యం భయాలు ఇందుకు కారణమయ్యాయి. మాంద్యంలోకి ప్రవేశిస్తే ముడి చమురుకు డిమాండ్‌ తగ్గవచ్చన్న అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. 


అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేటు పోటుతో అక్కడి బాండ్ల రిటర్నుల రేటు మరింత ఎగబాకడంతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ ఇంకాస్త బలపడింది. దాంతో అమెరికన్‌ బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు.. భారత్‌ సహా వర్ధమాన దేశాల మార్కెట్లలోని పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్య లభ్యత తగ్గడం, కరెన్సీ ఆల్‌టైం రికార్డు స్థాయికి పడిపోవటంతో పాటు ఇప్పటికీ పలు కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతుండటంతో మార్కెట్లో స్వల్పకాలిక వైఖరి బేరి్‌షగా కన్పిస్తోంది. మరికొంత కాలం మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలకు లోనుకావచ్చు. అప్పటివరకు రిటైల్‌ ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడుల కోసం వేచిచూడటం మేలు.

- వినోద్‌ నాయర్‌, జియోజిత్‌ 

ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ విభాగ అధిపతి 

Updated Date - 2022-09-24T08:13:44+05:30 IST