ప్లాస్మా దాతకు 5 వేలు

ABN , First Publish Date - 2020-08-01T09:32:43+05:30 IST

ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చిన వారికి రూ.5000 ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.

ప్లాస్మా దాతకు 5 వేలు

  • కరోనాను జయించిన వారికి సీఎం జగన్‌ ప్రోత్సాహం
  • సెప్టెంబరు 5 నుంచి స్కూల్స్‌.. ప్రతి చిన్నారికీ మాస్క్‌

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చిన వారికి రూ.5000 ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. కొవిడ్‌ బాధితుల్ని కాపాడాలంటే ప్లాస్మా థెరపీ ముఖ్యమని, కరోనాను జయించిన ప్రతి ఒక్కరూ ప్లాస్మా దా నానికి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాం పు కార్యాలయంలో కొవిడ్‌ కట్టడి, ఆస్పత్రుల్లో వైద్యం, వైద్య విద్యా వ్యవస్థలోని నా డు-నేడుపై సీఎం జగన్‌ సమీక్షించారు. ప్లాస్మా థెరపీపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దాతలకిచ్చే రూ.5 వేలు మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుందన్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఉండరాదని సూచించారు. బెడ్ల వివరాలను హెల్ప్‌డె్‌స్కలో ఉంచాలని, ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేదంటే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్‌ కేటాయించేలా అక్కడ నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు. ౅హెల్ప్‌ డెస్క్‌లో సక్రమంగా విధులు నిర్వహిస్తే చాలా వరకూ సమస్యలు తగ్గుతాయన్నారు. కరోనా కోసం నిర్దేశించిన 138 ఆస్పత్రుల యాజమాన్యంపై జాయింట్‌ కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.


కరోనా వంటి విపత్తులను ఎదుర్కోవాలంటే మూడేళ్లలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్‌తో ఆటో, టాక్సీ డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు ట్యాక్స్‌ చెల్లింపు గడువు పెంచాలని ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. ప్రభుత్వం అందించే విద్యా కానుకతో పాటు పిల్లలకు మాస్కులు ఇవ్వాలని వెంటనే వాటిని సిద్ధం చేయాలని ఆదేశించారు. మాస్కులు ఎలా వాడాలన్న దానిపై పిల్లలకి అవగాహన కల్పించాలన్నారు.  

Updated Date - 2020-08-01T09:32:43+05:30 IST