టీకాల కోసం అదనంగా రూ. 15 వేల కోట్లు కావాలి: కేవీ సుబ్రమణియన్

ABN , First Publish Date - 2021-06-18T04:21:42+05:30 IST

భారత్‌లో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం కేటాయించిన రూ. 35 వేల కోట్లకు అదనంగా మరో 15 వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందని ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తాజాగా అభిప్రాయపడ్డారు.

టీకాల కోసం అదనంగా రూ. 15 వేల కోట్లు కావాలి: కేవీ సుబ్రమణియన్

న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం కేటాయించిన రూ. 35 వేల కోట్లకు అదనంగా మరో 15 వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందని ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తాజాగా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అదనపు కేటాయింపులు చేసేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన తెలిపారు. రోజులో 24 గంటలూ టీకా వేయడం ద్వారా ఒక్క రోజులో 84 లక్షల టీకా డోసులు వేయాలన్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని ఆయన సూచించారు. మరింత శ్రమిస్తే..రోజుకు కోటి టీకా డోసులు కూడా వేయచ్చని ఆయన స్పష్టం చేశారు. తాజా లెక్కల ప్రకారం.. ఇప్పటివరకూ దేశంలో 27.28 కోట్ల టీకా డోసులు వినియోగమయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా మెజారిటీ ప్రజలకు టీకా అందేలా కేంద్రం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అనుకున్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోవాలంటే రోజుకు కోటి టీకా డోసులు వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.  

Updated Date - 2021-06-18T04:21:42+05:30 IST