మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 6 వేలు... * పథకానికి మరింత ప్రాచుర్యాన్ని కల్పించాలని కేంద్రం నిర్ణయం

ABN , First Publish Date - 2020-10-09T00:08:46+05:30 IST

మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్నందిస్తోంది. ఇందులో చేరిన వారికి రూ. 6 వేలు అందుతాయి. ఈ పథకం గర్భిణులకు మాత్రమే వర్తిస్తుంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై) కూడా ఒకటి. ఈ పథకం కేవలం గర్భిణి స్త్రీలకు మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రెగ్నెంట్ లేడీస్‌కు రూ. 6 వేల మేరకు ఆర్థిక సాయాన్నందిస్తోంది. ఈ డబ్బు... నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లోనే జమవుతుంది. తల్లీబిడ్డల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అందుబాటులోకి తీసుకువచ్చింది.

మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 6 వేలు...   * పథకానికి మరింత ప్రాచుర్యాన్ని కల్పించాలని కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ : మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్నందిస్తోంది. ఇందులో చేరిన వారికి రూ. 6 వేలు అందుతాయి. ఈ పథకం గర్భిణులకు మాత్రమే వర్తిస్తుంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై) కూడా ఒకటి. ఈ పథకం కేవలం గర్భిణులకు మాత్రమే వర్తిస్తుంది. కేంద్రం... ఈ పథకం ద్వారా గర్స్భిణులకు రూ. 6 వేల మేరకు ఆర్థిక సాయాన్నందిస్తోంది. ఈ డబ్బు... నేరుగా గర్భిణుల బ్యాంక్ ఖాతాల్లోనే జమవుతుంది. తల్లీబిడ్డల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అందుబాటులోకి తీసుకువచ్చింది.


కాగా... తొలి బిడ్డకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంటే తొలిసారి గర్భం దాల్చిన మహిళలకు రూ. 6 వేలను మూడు విడతల్లో అందిస్తారు. అంగన్‌వాడీ సెంటర్ లేదా ఆశా వర్కర్ వద్దకు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. గర్భం దాల్చిన మహిళలు ఈ పథకంలో చేరిన వెంటనే తొలి విడతగా  రూ. వెయ్యి అందుతాయి. రెండో విడత కింద రూ. 2 వేలు అందుతాయి. గర్భం దాల్చినన ఆరు నెలల తర్వాత ఈ డబ్బును పొందొచ్చు. చివరి విడతలో  రూ. 2 వేలు అందుతాయి.


కాగా... బిడ్డకు బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్ బి వంటి ఇంజెక్షన్లు వేయించిన తర్వాతే డబ్బందుతుంది. ఇక... ఈ రూ. 5 వేలు కాకుండా ‘జనని సురక్ష యోజన’ కింద ఆసుపత్రిలోనే రూ. వెయ్యి అందిస్తారు. మహిళకు మొత్తంమీద కేంద్రం నుంచి రూ. 6 వేలు అందుతాయి. కాగా... ఈ పథకానికి మరింతగా వన్నె తేవాలని కేంద్రం భావిస్తోంది. 


Updated Date - 2020-10-09T00:08:46+05:30 IST