Abn logo
Sep 25 2021 @ 00:46AM

స్కూటర్‌ డిక్కీలో రూ. 70 వేలు చోరీ

గుంతకల్లుటౌన, సెప్టెంబరు 24: పట్టణంలో అధ్యాపకుడు శ్రీనివాసులు  తన ద్విచక్ర వాహనంలో ఉంచిన రూ. 70 వేలను శుక్రవారం గుర్తు తెలియని వ్యక్త్తులు అపహరించారు. తిలక్‌నగర్‌కు చెందిన శ్రీనివాసులు సాయిబాబా డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. పట్టణంలోని ఎస్‌బీహెచలో రూ. 70 వేలను డ్రా చేసుకుని ద్విచక్ర వాహనంలోని డిక్కీలో ఉంచాడు. ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ద్విచక్ర వాహనాన్ని ఉంచి కూరగాయలు కొనుగోలు చేయడానికి వెళ్లాడు. కొనుగోలు చేసిన కూరగాయలను ఉంచడానికి డిక్కీ తీయగా  అందులో ఉంచిన డబ్బు కనిపించలేదు. డబ్బును చోరీ చేశారని గుర్తించి వనటౌన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపుల్లోని సీసీ కెమెరా పుటేజ్‌లను పరిశీలించగా మాస్కు హెల్మెట్‌ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి స్కూటర్‌ వద్ద డబ్బు ఎత్తుకెళ్లిన దృశ్యం రికార్డయ్యింది. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసులు తెలిపాడు.