గుణపాఠం నేర్వని యంత్రాంగం

ABN , First Publish Date - 2022-01-17T06:21:46+05:30 IST

జిల్లాలో కరోనా నియంత్రణపై అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోం ది. బాధితులకు వసతులు, వైద్యసేవలు అందించడం కోసం ముం దస్తు చర్యలు తీసుకోవడంలో తొలి నుంచి అధికారులు ఇ ష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

గుణపాఠం నేర్వని యంత్రాంగం
ఆస్పత్రి ఆవరణలో మళ్లీ ఏర్పాటు చేస్తున్న కొవిడ్‌ చికిత్స కేంద్రం

రూ.కోట్లు వృథా

ముందస్తు చర్యలపై ఇష్టారాజ్యం

మళ్లీ రూ.40 లక్షలతో ఆస్పత్రిలో తాత్కాలిక ఏర్పాట్లు

అధికారుల నిర్ణయాలపై పెదవి విరుపు

అనంతపురం వైద్యం, జనవరి16: జిల్లాలో కరోనా నియంత్రణపై అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోం ది. బాధితులకు వసతులు, వైద్యసేవలు అందించడం కోసం ముం దస్తు చర్యలు తీసుకోవడంలో తొలి నుంచి అధికారులు ఇ ష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.  తాత్కాలిక ముం దస్తు చర్యలతో కోట్ల రూపాయలు వృథా చేయటమే కాక కొందరు జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 మార్చిలో తొలి దశ కరోనా వైరస్‌ జిల్లాలో మొదలైంది. అప్పు డు నియంత్రణపై శ్రద్ధ చూపక పోవడంతో పాటు ఎవరికి వారు వ్యవహరించడంతో  కరోనా వెనువెంటనే విరుచుకు పడుతూ వచ్చింది. వేలాది మంది కరోనాకు చిక్కి విలవిల్లాడా రు. వందలాది మంది మరణించారు. మార్చి నుంచి దాదాపు ఆగస్టు వరకు తొలి వేవ్‌ తీవ్రంగా కొనసాగింది. ఆ సమయం లో పూర్తి స్థాయిలో వసతులు, వైద్యసేవలు అందించలేకపో యారు. ఆ తర్వాత కేసులు తగ్గడంతో అధికారులు కరోనా నియంత్రణ చర్యలు పక్కన పెట్టారు. 2020 మార్చిలో మళ్లీ రెండో వేవ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలలో  రోజుకు వేలల్లో కేసులు రావడంతో ఆస్పత్రుల్లో ప డకలు, ఆక్సిజన అందక అనేక మంది చనిపోయారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరి లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఆ సమయంలో కూడా ముందస్తు ఏర్పాట్ల విషయంలో అధికారులు అశ్రద్ధ చూపారు. కరోనా తగ్గు ముఖం పట్టిన తర్వాత మేల్కొన్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో రూ.2 కోట్లు వెచ్చించి తాత్కాలిక కొవిడ్‌ కేంద్రాన్ని అన్ని వసతులతో ఏర్పాటు చేశా రు. ఆ తర్వాత తాడిపత్రి వద్ద కూడా కోట్లు వెచ్చించి తాత్కా లిక కొవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఇన్ని కోట్లు పెట్టి ఏర్పా టు చేసే సమయానికి జిల్లాలో కొవిడ్‌ ప్రభావం తగ్గడం తో కేసులు తగ్గిపోయాయి. ఆస్పత్రికి వచ్చే బాధితులు పూర్తిగా తగ్గిపోయారు. దీంతో కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన తాత్కాలిక కొవిడ్‌ ఆస్పత్రులను అధికారుల సూచన మేరకు తొలగించేశారు. ఈ తొలగింపుపై అప్పట్లో పెద్ద విమర్శలు వచ్చిన పాలకులు, అధికారులు పట్టించుకోలే దు. ఇప్పుడు థర్డ్‌వేవ్‌ మొదలైంది. కేసులు అమాంతం పెరుగుతూ వస్తున్నా యి. ముందస్తు చర్యలపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. అయితే జిల్లా సర్వజన ఆస్పత్రిలో సైకిల్‌ స్టాండ్‌ ప్రాంతంలో బాధితులు వస్తే చికిత్స అందించేందుకు కొవిడ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. పాత కొవిడ్‌ కేంద్రానికి మరమ్మతులు చేస్తున్నారు. దాదాపు రూ.40 లక్షలు వ్యయం చేస్తున్నట్లు ఆ స్పత్రి సూపరింటెండెంట్‌ చెబుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కొవిడ్‌ ఆస్పత్రి కేంద్రాలను అలాగే ఉంచి ఉంటే ఈ రోజు మళ్లీ లక్షలు వెచ్చించాల్సిన  అవసరం ఉండేదికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఉన్నతా ధికారులు ఒక్కోరు ఉన్నప్పుడు ఒక్కో నిర్ణయం తీసుకోవడం వల్లే రూ.కోట్ల ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


కరోనా కేసులు పైపైకి

48 గంటల్లో 559 మందికి వైరస్‌

 నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం.. ఆందోళనలో తల్లిదండ్రులు 

అనంతపురం వైద్యం, జనవరి16: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పక్షం రోజుల్లోనే కేసులు పదింతలు పెరగడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 48 గంటల్లో జిల్లాలో 559 మంది కరోనా బారిన పడ్డారు. శనివారం 212 కేసులు, ఆదివారం 347 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 160073 మందికి కరోనా సోకగా ఇందులో 157485 మంది ఆరోగ్యంగా  కోలుకున్నారు. 1093 మంది మరణించగా ప్రస్తుతం 1495 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా థర్డ్‌వేవ్‌లో వైరస్‌ విజృంభిస్తుండటంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.  సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం సోమవారం మళ్లీ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కరోనా విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు పలు రాషా్ట్రలు సెలవులను పొడిగించాయి. ఆంధ్రప్రదేశలో కూడా కరోనా కేసులు అన్ని జిల్లాలోనూ అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు సెలవులు రాష్ట్రంలోనూ పొడగి స్తారని అనుకున్నారు. అయితే విద్యాశాఖా మంత్రి సెల వులు పొడిగించడం లేదని తెలిపారు. దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. తమ పిల్లలను పాఠశాలలకు పంపాలా వద్దా అని టెన్షన పడుతున్నారు. ప్రధానంగా విజయవాడతో పాటు ఇతర ప్రముఖ విధ్యా సంస్థల్లో చదువుతున్న పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. 


కలవర పెడుతున్నకరోనా మెసేజ్‌లు

కరోనా సమా చారం అందించే మెసేజ్‌లు కలవర పెడుతున్నాయి. కరోనా పరీక్షలు చేయించుకున్నవారికి పాజిటివా... నెగిటి వా అనే సమాచారం వారిచ్చిన ఫోన నంబర్‌కు మెసేజ్‌ పంపుతున్నారు. ఇటీవల పాజిటివ్‌ కేసులు పెరగడంతో మళ్లీ మెసేజ్‌ పంపే ప్రక్రియను ప్రారంభించారు. ఇటీవల పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి పేరుమీద మీరు కాంటాక్ట్‌ అ య్యారు. కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని మరొకరికి సమాచారం ఇస్తున్నారు. ఇది మంచిదే. అయితే ఆ కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఎవరో తెలియకుండా అతడితో కాంటాక్ట్‌ అయ్యారని సమాచారం పంపడంతోనే ఆ వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు హెచ్చెల్సీ కాలనీకి చెందిన మారుతీ రావు అనే వ్యక్తికి శనివారం సాయంత్రం ఓ మెసేజ్‌  పంపారు. ఎంవీ శివారెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది మీరు సెకండరీ కాంటాక్ట్‌ కాబట్టి కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆ మెసేజ్‌లో పంపారు. అయితే ఆ ఎంవీ శివారెడ్డి ఎవరో మెసేజ్‌ వచ్చిన మారుతీరావుకు తెలియదు. అలాంటప్పుడు ఆ వ్యక్తులతో వీరు కాంటాక్ట్‌ అయ్యారని ఎలా గుర్తిస్తున్నారో వారి ఫోన నంబర్‌లకు ఎలా మెసేజ్‌లు పంపిస్తున్నారో అర్థం కాక టెన్షన పడుతున్నారు. 



కొవిడ్‌ సోకిందనే ఆందోళన వద్దు

జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప

అనంతపురం క్రైం, జనవరి 16 : కొవిడ్‌ సోకిందని పోలీసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవరం లేదని తగిన వైద్యసేవలందించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప భరోసా కల్పించారు.  శనివా రం ఆ యన తన చాంబర్‌ నుంచి కొవిడ్‌ సో కిన పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స నిర్వహించి వారి ఆరోగ్య విషయాలు.. అందించే వైద్య సేవలు తదితర ఆంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జి ల్లా వ్యాప్తంగా 27 మంది పోలీసులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిం దన్నారు. వీరిలో ఒకరిని నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చించి మెరుగైన వైద్యసేవలందిస్తున్నట్టు తెలిపారు. సకాలంలో పోలీసు డాక్టర్‌ వెంకటేశ్వర ప్రసాద్‌ ద్వారా  తగిన వైద్యసేవలు పొందేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ రామకృష్ణప్రసాద్‌, పోలీసు డాక్టర్‌ వెంకటేశ్వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T06:21:46+05:30 IST