కారు కింద పడతారా.. ఏనుగెక్కుతారా?: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

ABN , First Publish Date - 2021-08-09T03:01:25+05:30 IST

కారు కింద పడతారా.. ఏనుగెక్కుతారా? అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో ఆయన బహుజన సమాజంలో బానిసలం కాదు

కారు కింద పడతారా.. ఏనుగెక్కుతారా?: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

నల్లగొండ: కారు కింద పడతారా.. ఏనుగెక్కుతారా? అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో ఆయన బహుజన సమాజంలో మనం బానిసలం కాదు పాలకులమని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ఈ జన సునామీని ఎవరూ ఆపలేరని చెప్పారు. సీఎం కేసీఆర్ విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారెందుకు? అని ప్రశ్నించారు. ఆ డబ్బులు.. గిరిజన బిడ్డలు వ్యవసాయం చేసి.. ఆదివాసీ బిడ్డలు అడవుల్లో నుంచి తేనె సేకరించి సంపాదించిన డబ్బులేనని తెలిపారు. ‘‘మీకు మాపై ప్రేమ ఉంటే మీ ఆస్తులు అమ్మి డబ్బులు ఖర్చు చేయండి. మా కష్టార్జితాన్ని మేమే నిర్ణయించుకునేలా చేయండి. విశ్వ విద్యాలయాల్లో కొన్నేళ్లుగా రిక్రూట్‌మెంటే లేదు. మా జీవితాలను బాగు చేసే ఉద్దేశం లేదా?’’ అని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు.

Updated Date - 2021-08-09T03:01:25+05:30 IST