జంతువుల దత్తతకు రూ.15 లక్షలు

ABN , First Publish Date - 2020-12-01T06:54:50+05:30 IST

తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో జంతు వుల దత్తతకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ దినేష్‌కుమార్‌ ఖారా ముం దుకొచ్చారు

జంతువుల దత్తతకు రూ.15 లక్షలు
క్యూరేటర్‌కు చెక్‌ అందిస్తున్న ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌కుమార్‌

 జూ క్యూరేటర్‌కు చెక్కు అందజేసిన ఎస్‌బీఐ చైర్మన్‌ 

తిరుపతి(అటవీశాఖ), నవంబరు 30: తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో జంతు వుల దత్తతకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ దినేష్‌కుమార్‌ ఖారా ముం దుకొచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆయన ఆదివారం జూపార్కును సందర్శించారు. జూ అభివృద్ధి, జంతువుల ఆహార విషయమై క్యూరేటర్‌ హిమశైలజను వివరాలు తెలుసుకున్నారు. జంతువుల దత్తత విషయం ఆయనకు వివరించగా.. తానూ కొన్ని జంతువులను దత్తత తీసుకుంటానని తెలిపారు. పెద్దపులి, చిరుతపులి, సింహంను ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. వాటికయ్యే ఖర్చు రూ.15 లక్షలను చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శరవణన్‌, క్యూరేటర్‌ హిమశైలజకు చెక్కు రూపంలో అందజేశారు. మూగ జంతువులను దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని దినేష్‌కుమార్‌ ఖారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో మాధవరావ్‌, ఎస్‌బీఐ అధికారులు సంజయ్‌సాహ్య, గిరిధర్‌, సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన  జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు.  


Updated Date - 2020-12-01T06:54:50+05:30 IST