సమీకృత మార్కెట్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు

ABN , First Publish Date - 2022-01-21T06:56:39+05:30 IST

సమీకృత మా ర్కెట్ల ఏర్పాటుకు రూ. 500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ తెలిపారు.

సమీకృత మార్కెట్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్‌శర్మ

 సమీకృత మార్కెట్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు

 అదనపు కలెక్టర్‌  రాహుల్‌శర్మ

మిర్యాలగూడ, జనవరి 20: సమీకృత మా ర్కెట్ల ఏర్పాటుకు రూ. 500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ తెలిపారు. గురువారం రాత్రి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నల్లగొండ, నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ మునిసిపాలి టీల్లో సమీకృత మార్కెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. మిర్యాలగూడ పాత బస్టాండ్‌ స్థలాన్ని సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. గజ్వేల్‌ తరహాలో కూరగాయలు, మాంసం విక్రయాలను ఒకే చోట జరిగేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. నూ తన మార్కెట్లలో పాత వ్యాపారులకు మడిగెలు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్డీవో రోహితసింగ్‌, డీఎస్పీ వెంకటేశ్వరరా వు, తహసీల్దార్‌ గణేష్‌, మునిసిపల్‌ కమిషనర్‌ రవీంద్ర సాగర్‌, ఆర్‌ఐ, నేతాజీ కూరగాయల మార్కెట్‌ అధ్యక్షుడు అహ్మద్‌ చావూస్‌, శ్రీనివాస్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-21T06:56:39+05:30 IST