లింగ బేదం, సమానత్వం, మహిళలపై చిన్న చూపు అంశాలతో రూపొందిన షార్ట్ ఫిలిం నట్కట్. 2021 ఏడాదికిగానూ బెస్ట్ షార్ట్ ఫిలిం క్యాటగిరి ఆస్కార్ అవార్డ్రేసులో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ నిర్మించిన 'నట్కట్' నిలిచింది. 2020లో బెస్ట్ ఆఫ్ ఇండియా షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో 'నట్కట్' ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విద్యాబాలన్ తల్లిపాత్రలో నటించారు. ఈ షార్ట్ ఫిలింతో నిర్మాతగా పరిచయం అయ్యారు. 2021 షార్ట్ ఫిలిం ఆస్కార్ అవార్డ్ రేసులో నిలవడంపై నిర్మాణ సంస్థ ఆర్ఎస్వీపీ, విద్యాబాలన్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రియాంక చోప్రా కూడా విద్యాబాలన్‌కు మద్దతు తెలిపారు.