ట్రావెల్ నిబంధనలు మార్చిన Canada.. తెలియకపోతే ఇబ్బందులు తప్పవంటున్న ట్రావెల్ ఏజెంట్లు..!

ABN , First Publish Date - 2021-11-24T21:35:10+05:30 IST

భారత ప్రయాణికుల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కెనడా ప్రభుత్వం తాజాగా ప్రయాణ ఆంక్షలను రూపొందించింది. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆ నిబంధనలను పా

ట్రావెల్ నిబంధనలు మార్చిన Canada.. తెలియకపోతే ఇబ్బందులు తప్పవంటున్న ట్రావెల్ ఏజెంట్లు..!

ఎన్నారై డెస్క్: భారత ప్రయాణికుల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కెనడా ప్రభుత్వం  తాజాగా ప్రయాణ ఆంక్షలను రూపొందించింది. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా ప్రయాణ నిబంధనలు తెలుసుకోకపోతే.. ప్రయాణికులకు ఇబ్బందులు  తప్పవని ట్రావెల్ ఏజెంట్లు హెచ్చరిస్తున్నారు. భారత ప్రయాణిలకు విషయంలో కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే..



కరోనా మహమ్మారి దెబ్బకు ఏకంగా ప్రపంచమే లాక్‌డౌన్ అయిన విషయం తెలిసిందే. అయితే వైరస్ ఉధృతి తగ్గిన తర్వాత చాలా దేశాలు విదేశీ ప్రయాణికులకు స్వాగతం పలికాయి. చాలా వరకు ఆంక్షలను కూడా సడలించాయి. కాగా.. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు.. తమ ప్రయాణానికి 18 గంటల ముందు కచ్చితంగా ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను అలాగే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను ArriveCAN app‌లో అప్‌లోడ్ చేయాలని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. పలవురు ట్రావెట్ ఏజెంట్లు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. కరోనా టెస్ట్ చేయించుకోకుండా ప్రయాణానికి సిద్ధం అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. 




Updated Date - 2021-11-24T21:35:10+05:30 IST