ఆర్టీసీకి స్పందన అంతంతమాత్రమే.....

ABN , First Publish Date - 2020-06-02T09:10:21+05:30 IST

రీజియన్‌ వ్యాప్తంగా పునఃప్రారంభించిన ఆర్టీసీ సర్వీసులకు ప్రయాణికుల నుంచి స్పందన నామమాత్రంగా వచ్చింది.

ఆర్టీసీకి స్పందన అంతంతమాత్రమే.....

గుంటూరు, జూన్‌ 1: రీజియన్‌ వ్యాప్తంగా పునఃప్రారంభించిన ఆర్టీసీ సర్వీసులకు ప్రయాణికుల నుంచి స్పందన నామమాత్రంగా వచ్చింది. జిల్లాలో 13 డిపోలకు 12 డిపోల నుంచి 72 సర్వీసులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా 59 సర్వీసులు రోడ్డెక్కాయి. అయితే ఇందుకు అనుగుణంగా ప్రయాణికులు మాత్రం ముందుకు రాలేదు. తొలి రోజు 59 సర్వీసులు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు రాకపోకలు సాగించాయి.


తొలి రోజు 222 ట్రిప్పులు వేయగా 1175 మంది గమ్యస్థానాలకు చేరారు. కొందరు టిక్కెట్‌ బుక్‌ చేసుకోకుండానే బస్టాండ్‌కు చేరుకొని తమకు టిక్కెట్‌ బుక్‌ చేయమని కోరుతుండటం ఆన్‌లైన్‌ బుకింగ్‌పై అవగాహన లేదని తెలుస్తోంది. గుంటూరు బస్టాండ్‌ నుంచి సోమవారం ఉదయం ఐదుగురు ప్రయాణికులతో చిలకలూరిపేటకు బస్సు బయల్దేరింది. ఆర్టీసీ టిక్కెట్లను వెబ్‌సైట్‌తో పాటు స్మార్ట్‌ ఫోన్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ వ్యాలెట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని ఆర్టీసీ ఆర్‌ఎం  రాఘవకుమార్‌ తెలిపారు.  

Updated Date - 2020-06-02T09:10:21+05:30 IST