ఆర్టీసీ చరిత్రలో.. ఉద్యోగులను సన్మానించడం మొదటిసారి : ఈడీ

ABN , First Publish Date - 2021-03-06T07:24:03+05:30 IST

ఆర్టీసీ చరిత్రలో ఉద్యోగులను సన్మానించడం ఇదే మొదటిసారని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు అన్నారు.

ఆర్టీసీ చరిత్రలో..  ఉద్యోగులను సన్మానించడం మొదటిసారి : ఈడీ

రాంగోపాల్‌పేట్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ చరిత్రలో ఉద్యోగులను సన్మానించడం ఇదే మొదటిసారని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం రాణీగంజ్‌ 1, 2 డిపోల సంయుక్తాధ్వర్యంలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లను సన్మానించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ రీజనల్‌ మేనేజర్‌ యుగంధర్‌, రాంగోపాల్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ టీసీహెచ్‌ బాబు, మహంకాళి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌యాదవ్‌, తిరుమలగిరి ఎంవీఐ జె. శ్రీనివాస్‌, డిపోల మేనేజర్లు ఉమామహేశ్వర్‌రావు, భీంరెడ్డి, జగన్‌, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-06T07:24:03+05:30 IST