Abn logo
Oct 22 2021 @ 00:04AM

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

లారీని ఢీకొనడంతో దెబ్బతిన్న ఆర్టీసీ బస్సు

పది మందికి గాయాలు

దువ్వూరు, అక్టోబరు 21: దువ్వూరు మండ ల పరిధిలోని జిల్లేళ్ల సమీపంలో కడప-కర్నూలు జాతీయ రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆళ్లగడ్డ నుంచి మైదుకూరుకు పల్లె వెలుగు బస్సు వస్తోంది. దువ్వూరు మండలం జిల్లేళ్ల సమీపంలో అధిక వర్షం కారణంగా ముందు వెళుతున్న లారీని బస్సు డ్రైవరు గుర్తించలేదు. దీంతో లారీని వెనుకవైపుగా బస్సు ఢీకొంది. దీంతో బస్సు డ్రైవర్‌ కాళ్లు తీవ్రంగా గాయపడ్డాయి. బస్సులో ప్రయాణిస్తున్న మరో తొమ్మిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దువ్వూరు ఎస్‌ఐ కేసీ రాజు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.