Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్కూటర్‌ను తప్పించబోయి మార్జిన్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ప్రకాశం : ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు పొన్నలూరు చెరువులోకి దూసుకెళ్లింది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రెడ్డి పాలెం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. కందుకూరు నుంచి కనిగిరికి ఆర్టీసీ బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చెట్లు అడ్డుగా ఉండటంతో చెరువులోకి పడిపోకుండా ఆగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఎలంటి ప్రాణాపాయమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement
Advertisement