ప్రజల ప్రయాణానికి భరోసా

ABN , First Publish Date - 2021-09-18T06:03:35+05:30 IST

ప్రజల ప్రయాణానికి భరోసా

ప్రజల ప్రయాణానికి భరోసా

విచారణ జరుపుతాం..  అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే చర్యలు తీసుకుంటాం

ఆర్టీసీ ఆర్‌ఎం సోలోమాన్‌

ఖమ్మం, సెప్టెంబరు 17 (ఆంధ్ర జ్యోతి):కండీషన్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు లనే సర్వీసులకు అనుమతిస్తు న్నామ నీ, ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల వల్ల ఇబ్బందులు లేవని, ఆర్టీసీలో ప్రజల ప్రయా ణానికి పూర్తి భరోసా కల్పిస్తున్నామనీ ఆర్టీసీ ఖమ్మం రీజనల్‌ మేనేజర్‌ సోలోమాన్‌ అన్నారు. రెండు రోజులుగా ‘ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమైన కథనాలు జిల్లా వ్యాప్తంగా సంచ లనం రేకెత్తించాయి. ఆయా కథనాలకు స్పందించిన ఆర్‌ఎం ఆర్టీసీలోని అద్దెబస్సుల విషయంలో విచారణ జరిపి, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామ న్నారు. ప్రతీ రెండేళ్లకు బస్సును ఆర్టీఏ అధికారులు తనిఖీ చేసి ఫిట్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాతనే కార్పొరేషన్‌లో వాడుకుంటున్నామ న్నారు. కార్పొరేషన్‌లో ఉన్న ప్రతి బస్సును మెయింటెనెన్స్‌ చేసిన తర్వాత ఫిట్‌గా ఉంటేనే సర్వీసుకు పంపించామన్నారు. పాత బస్సు అయితే ప్రతీ సంవత్సరానికి ఒకసారి, కొత్త బస్సు అయితే ప్రతీ రెండేళ్లకోసారి ఆర్టీఏ అధికారులు తనిఖీ చేసి వాడుకోవడం జరుగుతుందన్నారు. ఫిట్‌గా లేని ఆర్టీసీ బస్సు లను స్ర్కాప్‌కు పంపిస్తామన్నారు. 12లక్షల కిలోమీటర్లు దాటి న బస్సులను స్ర్కాప్‌ చేసేందుకు హెడ్‌ ఆఫీస్‌ అనుమతి తీసుకుని దశలవారీగా స్ర్కాప్‌ యార్డ్‌ కు తరలించనున్నట్టు ఆయన తెలిపారు. పల్లెవెలుగు నాలుగేళ్లు పూర్తయిన తర్వాత పునరుద్ధరణకు 10రోజులు గడువు ఇచ్చి ఆర్టీసీ అధికారుల కమిటీ పరిశీలించిన తర్వాత రెండు మరో రెండు సంవత్స రాలు బస్సును అగ్రిమెంట్‌ చేసుకుని వాడుకోవడం జరుగు తుందన్నారు. ఆ తర్వాత మరో మూడేళ్లు బస్సును వాడుకుం టామన్నారు.అలా తొమ్మిదేళ్లు అయిన తర్వాత బస్సును కార్పొ రేషన్‌నుంచి తొలగిస్తామని, ఎక్స్‌ప్రెస్‌ను ఆరేళ్ల తర్వాత పూర్తిగా తీసేస్తామన్నారు. 

టెండర్ల ప్రకారం కొత్త బస్సుల ఏర్పాటు 

అద్దెబస్సుల అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యంబాబు

‘ఆంధ్రజ్యోతి’ కథనాల పట్ల స్పందించిన అద్దె బస్సుల అసో సియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌. సత్యంబాబు శుక్రవారం జరి గిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టెండర్ల ప్రకారం ఆర్టీ సీలో కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీవీఎం ఆధ్వర్యంలో ధ్రువీకరించిన తర్వాత మాత్రమే సర్వీసులకు వెళ్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాత బస్సులను అద్దెకు పెట్టడం లేదని తెలిపారు. కరోనా వల్ల బస్‌లు నడవలేదు కాబట్టి మరో రెండు సంవత్సరాలు9 అగ్రిమెంటు పెంచాలని అధికారులను కోరారు. ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు కూడా నెలనెలా అద్దెలు చెల్లించడం లేదన్నారు. 

Updated Date - 2021-09-18T06:03:35+05:30 IST