సెక్యూరిటీ డిపాజిట్‌ లేకుండా ఆర్టీసీ బస్‌

ABN , First Publish Date - 2021-10-23T08:19:40+05:30 IST

పెళ్ల్లిళ్లు, వేడుకలు, దూర ప్రాంతాల టూర్లకు బృందాలుగా వెళ్లేందుకు ముందస్తు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయకుండానే బస్సులను బుక్‌ చేసుకునే సదుపాయం

సెక్యూరిటీ డిపాజిట్‌ లేకుండా ఆర్టీసీ బస్‌

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పెళ్ల్లిళ్లు, వేడుకలు, దూర ప్రాంతాల టూర్లకు బృందాలుగా వెళ్లేందుకు ముందస్తు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయకుండానే బస్సులను బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించినట్టు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆర్టీసీ బస్సులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. బస్సు అవసరమైన వారు సమీప డిపో మేనేజర్‌ను సంప్రదించాలని సూచించారు. ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు.. 040-30102829, 040-68153333 ద్వారా సమాచారం పొందవచ్చన్నారు. 

Updated Date - 2021-10-23T08:19:40+05:30 IST