ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి..

ABN , First Publish Date - 2020-06-01T09:31:57+05:30 IST

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రీజియన్‌వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు పునఃప్రారంభించేందుకు అఽధికారులు సన్నాహాలు చేశారు.

ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి..

 గుంటూరు, మే 31: లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రీజియన్‌వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు పునఃప్రారంభించేందుకు అఽధికారులు సన్నాహాలు చేశారు. గతవారంలో 8 డిపోలకే పరిమితమైన రాకపోకలను తాజాగా 12 డిపోల నుంచి బస్సులను అందుబాటులో తెచ్చేం దుకు సిద్ధం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండ టంతో నరసరావుపేట డిపోలో నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. 72 సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌టీపీ రాఘ వకుమార్‌ తెలిపారు.


అయితే ప్రయాణికులు టిక్కెట్లను ఆన్‌ లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలని స్పష్టం చేశారు. హెచ్‌టీ టీపీఎస్‌://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్‌ఆర్‌టీసీఓఎన్‌ఎల్‌ఐఎన్‌ఇ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో టిక్కెట్‌లు రిజర్వేషన్‌ చేసుకోవచ్చన్నారు. భౌతికదూరం పాటించేలా సీటింగ్‌లలో మార్పులు చేశారు. మాస్కులు తప్పనిసరి. ఒక బస్టాండ్‌ నుంచి మరో బస్టాండ్‌ వరకు మాత్రమే బస్సులు రాకపోకలు సాగిస్తాయి. గుంటూరు నుంచి విజయవాడకు బస్సులు తిరగవు.

Updated Date - 2020-06-01T09:31:57+05:30 IST