రేపటి నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2021-06-20T04:56:05+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు కర్ఫ్యూ సమయాన్ని ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలించడంతో వివిధ ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు జమ్మలమడుగు ఆర్టీసీ డిపో మేనేజర్‌ రామసుబ్బయ్య తెలిపారు.

రేపటి నుంచి వివిధ ప్రాంతాలకు   ఆర్టీసీ బస్సులు

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 19: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు కర్ఫ్యూ సమయాన్ని ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలించడంతో  వివిధ ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు జమ్మలమడుగు ఆర్టీసీ డిపో మేనేజర్‌ రామసుబ్బయ్య తెలిపారు.  శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ  ప్రయాణికుల సౌకర్యార్థం  ఉదయం 6  నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సు లు నడుపనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడకు ఉదయం 9 గంటలకు, తిరుపతి ఉదయం 4 గంటల నుంచి, 4.45, 5.20, 6.00, 7.00, 7.45, 12.30, 1.30, 2.30 గంటల వరకు నడుపనున్నట్లు తెలిపారు. నెల్లూరుకు ఉదయం 4.40 నుంచి 6.20, 7.20, 8.20లకు,  కర్నూలు ఉదయం 4.45 గంటల నుంచి 6.45, 10.50, 11.50 గంటల వరకు, మదనపల్లెకు ఉదయం 6.45, 8.00 గంటల వరకు తాడిపత్రికి ఉదయం 5.20 నుంచి సాయంత్రం 5.00 గంటలకు ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు  ప్రొద్దుటూరుకు ఉదయం 6.15 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు నాన్‌స్టా్‌ఫ సర్వీసు ఉందన్నారు. ముద్దనూరుకు ఉదయం 5.50 నుంచి సాయంత్రం 5.30 గంటలకు ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు నడపడంతోపాటు ఆళ్లగడ్డకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్‌ తెలిపారు.

Updated Date - 2021-06-20T04:56:05+05:30 IST