ఆర్టీసీ డి పో గ్యారేజ్‌లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-07-08T10:40:20+05:30 IST

మంచిర్యాల ఆర్టీసీ డిపో గ్యారేజ్‌లో కార్మికులు కరోనా బారిన పడడం కలకలం సృష్టించింది.

ఆర్టీసీ డి పో గ్యారేజ్‌లో కరోనా కలకలం

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 7: మంచిర్యాల ఆర్టీసీ డిపో గ్యారేజ్‌లో కార్మికులు కరోనా బారిన పడడం కలకలం సృష్టించింది. అధికారుల సూచనల మేరకు వైద్యపరీక్షలు నిర్వహించడంతో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా మరొకరికి అవే లక్షణాలు ఉండటంతో  బెల్లంప ల్లి ఐసోలేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. గ్యారేజ్‌ సెక్షన్‌లో 110మంది కార్మికులు విధులు నిర్వహిస్తారు. సమిష్టిగా పనిచేస్తేనే గ్యారేజ్‌ నిర్వహణ సాధ్యమవుతుందని, కరోనా సోకిన నేపథ్యంలో 15 రోజలపాటు స్వచ్ఛందంగా సెలవులు మంజూరుచేయాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. లేదంటే డిపోలోనే ఉం టూ విధులు నిర్వహిస్తామని అధికారులకు విన్నవించారు.


డీఎం మల్లేషయ్య కార్మికులతో మాట్లాడుతూ ఎవరూ భయాందోళనకు గురి కావద్దని, అనారోగ్యంతో ఉన్న కార్మికులు మినహా మిగిలిన కార్మికులు విధులకు హాజరు కావాలన్నారు. రెస్క్యూ సిబ్బందితో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని డిపో ఆవరణ, గ్యారేజ్‌లలో స్ర్పే చేయించారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిం చి మాస్కులు, శానిటైజర్‌ వినియోగిస్తూ అప్రమత్తం గా ఉండాలని సూచించారు. అసిస్టెంట్‌ డీఎం శ్రీలత, సీనియర్‌ అసిస్టెంట్‌ ఎంఎస్‌ పాషా, సెక్యూరిటీ ఇన్‌ చార్జి సురేందర్‌రావు, మెకానికల్‌ ఫోర్‌మెన్‌ మధుసూదన్‌, శ్రీనివాస్‌, సంపత్‌ కుమార్‌, పాల్గొనారు. 


20వ వార్డులో...

మంచిర్యాల టౌన్‌: జిల్లా కేంద్రంలోని 20వ వార్డు రాంనగర్‌ టీచర్స్‌ కాలనీలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రాగా మంగళవారం వార్డు కౌన్సిలర్‌ అంకం నరేష్‌  సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో ఫోన్‌లో మాట్లాడారు. ఏ అవసరం ఉన్నా బాధిత కుటుంబ సభ్యులు సంప్రదించాలని కౌన్సిలర్‌ చెప్పారు. అలాగే రెండు ప్రాంతాలను కట్టడి ప్రాంతంగా ప్రకటించి ముందస్తు చర్యల్లో భా గంగా పారిశుధ్య పనులు చేపట్టినట్లు తెలిపారు.  

Updated Date - 2020-07-08T10:40:20+05:30 IST