Abn logo
Sep 28 2021 @ 22:35PM

ట్రాక్టర్‌ కింద పడి ఆర్టీసీ డ్రైవరు మృతి

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆర్టీసీ డ్రైవరు నరసింహం

వెంకటగిరి, సెప్టెంబరు 28 : సెలవు పెట్టి వస్తానని ఇంటి నుంచి బయలుదేరిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌ ట్రాక్టర్‌ కింద పడి మృత్యువాత పడ్డాడు.  ఈ విషాద సంఘటన పట్టణంలో మంగళవారం జరిగింది.  పోలీసుల కథనం మేరకు వెంకటగిరికి చెందిన ముత్తరాసి నరసింహులు(53) స్థానిక ఏపీఎస్‌ ఆర్టీసీ డిపోలో డ్రైవరుగా పనిచేస్తున్నారు. పోలేరమ్మ జాతర సందర్భంగా కుటుంబ సభ్యులతో గడిపేందుకు విధులకు సెలవు పెట్టి  వస్తానని ఇంటి నుంచి మోటారు బైక్‌పై బయలుదేరాడు. డిపో అధికారులకు సెలవు చీటి అందజేశారు. తిరిగి ఇంటికి  వస్తుండగా స్థానిక పాత బస్టాండు సెంటరులో ప్రమాదవ శాత్తు ట్రాక్టరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నరసింహులు మృతితో తూర్పువీధీ పాత బ స్టాండు సెంటరులో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.