ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌

ABN , First Publish Date - 2021-04-17T05:39:58+05:30 IST

ఉద్యోగం లేని యువతకు ఉపాధిమార్గం చూపడంతో పాటుగా నష్టాల్లో కొనసాగుతున్న సంస్థకు ఆదాయాన్ని సమకూర్చేలా విన్నూత ఆలోచనకు శ్రీకారం చుట్టింది టీఎ్‌సఆర్టీసీ. ఇప్పటికే కార్గో సర్వీ్‌సను ప్రారంభించి లాభాన్ని గడిస్తున్న సంస్థ ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌ను ప్రారంభించనుంది. సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలుస్తున్న ఆర్టీసీ.. డ్రైవింగ్‌లో యువతకు శిక్షణ ఇవ్వనుంది. మెదక్‌ జిల్లా కేంద్రంలోని బస్‌ డిపో ప్రాంగణంలో నెలాఖరులోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు బస్సును కేటాయించారు.

ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌

మెదక్‌ డిపోలో శిక్షణా కేంద్రం

నెలాఖరులోగా ప్రారంభం 

డ్రైవింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

తగిన ఫీజుతో యువతకు నెల రోజుల పాటు శిక్షణ

సంస్థకు మరో ఆదాయ మార్గం


మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 16 : ఉద్యోగం లేని యువతకు ఉపాధిమార్గం చూపడంతో పాటుగా నష్టాల్లో కొనసాగుతున్న సంస్థకు ఆదాయాన్ని సమకూర్చేలా విన్నూత ఆలోచనకు శ్రీకారం చుట్టింది టీఎ్‌సఆర్టీసీ. ఇప్పటికే కార్గో సర్వీ్‌సను ప్రారంభించి లాభాన్ని గడిస్తున్న సంస్థ ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌ను ప్రారంభించనుంది. సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలుస్తున్న ఆర్టీసీ.. డ్రైవింగ్‌లో యువతకు శిక్షణ ఇవ్వనుంది. మెదక్‌ జిల్లా కేంద్రంలోని బస్‌ డిపో ప్రాంగణంలో నెలాఖరులోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు బస్సును కేటాయించారు. 


నెల రోజుల పాటు శిక్షణ

ఒక్కో బ్యాచ్‌కు నాలుగు వారాల పాటు డ్రైవింగ్‌ శిక్షణ ఇస్తారు. కేవలం డ్రైవింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు. మొదటి ఐదు రోజులు బస్సు విడిభాగాలపై, కండిషన్‌ గుర్తింపు, బ్రేక్‌ డౌన్‌ అయిన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఆర్టీసీ మెకానికల్‌ ఇంజినీర్‌, బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌, డ్రైవింగ్‌ శిక్షకులతో థియరీ క్లాసులు నిర్వహిస్తారు. అనంతరం 25 రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు. బ్యాచ్‌లోని ఒక్కొక్కరికి అరగంటపాటు స్టీరింగ్‌ కేటాయిస్తారు. శిక్షణ అందించేందుకు 30 సంవత్సరాల అనుభవం కలిగిన డ్రైవర్లను ఎంపిక చేశారు.


ఫీజు రూ.15,600.. బ్యాచ్‌కు 16 మంది

డ్రైవింగ్‌పై ఆసక్తి ఉన్న వారు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో నెలకో బ్యాచ్‌ చొప్పున 16 మందిని ఎంపిక చేసి 30 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఇందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15,600 ఫీజుగా వసూలు చేస్తారు. ఎస్పీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ స్పాన్సర్‌ చేస్తే ప్రభుత్వమే పూర్తి ఫీజు భరిస్తుందని మెదక్‌ డిపో మేనేజర్‌ ప్రణీత్‌కుమార్‌ తెలిపారు.


ఉపాధికి అవకాశం

30 రోజుల శిక్షణ అనంతరం ఆర్టీసీ సంస్థ నుంచి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. భవిష్యత్‌లో సంస్థలో డ్రైవర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ పడినప్పుడు ప్రాధాన్యం కల్పిస్తారు. అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక బస్సును కేటాయించారు. బస్సుకు డ్యూయల్‌ స్టీరింగ్‌, సీట్లు ఏర్పాటు చేశారు. ఇద్దరి వద్ద క్లచ్‌, బ్రేక్‌, ఎక్సలేటర్‌ ఏర్పాటు చేశారు. అఽభ్యర్థులను ఒకవైపు కూర్చోబెట్టి... మరోవైపు శిక్షకులు మెలకువలు నేర్పిస్తారు. రద్దీ రోడ్లు, ఖాళీ రోడ్లు, నైట్‌ డ్రైవింగ్‌, జిగ్‌జాగ్‌ ట్రాఫిక్‌ ప్రాంతాల్లో శిక్షణ ఇస్తారు.


సద్వినియోగం చేసుకోవాలి 

ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. 20 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఏడాది లైట్‌ మోటార్‌ వెహికల్‌ ట్రాన్స్‌పోర్టు, క్యాబ్‌ లైసెన్స్‌ బ్యాడ్జ్‌ నంబర్‌ కలిగి ఉండాలి. కనీసం ఎనిమితో తరగతి పాసై ఉండాలి. హెవీ మోటార్‌ వెహికల్‌ లెర్నింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉన్నవారు అర్హులు. 

- ప్రణీత్‌కుమార్‌, డిపో మేనేజర్‌, మెదక్‌



Updated Date - 2021-04-17T05:39:58+05:30 IST