Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈయూను గెలిపించండి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదరరావు 

గుంటూరు, నవంబరు 30: ఆర్టీసీలో ఈనెల 14న జరగనున్న క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికల్లో ఎంప్లాయిస్‌ యూనియన్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలిశెట్టి దామోదరరావు కోరారు. కొత్తపేటలోని సీపీఐ మల్లయ్యలింగం భవన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. 54 ఏళ్లు పాలకమండళ్లుగా ఉన్న చరిత్ర ఈయూకు ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మరోసారి ఈయూకు అవకాశం కల్పించాలని ఉద్యోగులను కోరారు. కార్యక్రమంలో ఈయూ నాయకులు జీవీ నరసయ్య, ఎన్‌వీ కృష్ణారావు, కోటయ్య, కోటేశ్వరరావు, విజయ్‌కుమార్‌, రాజేష్‌ఖన్నా, ఎస్‌కే ఖాజా, డీవీ స్వామి తదితరులున్నారు. 

 

Advertisement
Advertisement