3 రకాలుగా వెసులుబాటు

ABN , First Publish Date - 2020-09-23T09:28:06+05:30 IST

ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో పెన్షన్‌ విధానంపై ఆర్టీసీ ..

3 రకాలుగా వెసులుబాటు

ఆర్టీసీ ఉద్యోగుల పెన్షన్‌ విధానమిదీ

రిటైర్మెంట్‌ వయసు పెంపుతో స్పష్టతనిచ్చిన యాజమాన్యం


హైదరాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో పెన్షన్‌ విధానంపై ఆర్టీసీ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు మంగళవారం అన్ని డిపోలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులకు పీఎఫ్‌ కార్యాలయం నుంచే పెన్షన్‌ వస్తుంటుంది. ప్రతి నెలా ఉద్యోగి వేతనం నుంచి 12ు, ఆర్టీసీ నుంచి 12ు చొప్పున పీఎ్‌ఫను కట్‌ చేస్తారు. అయితే మొత్తం 24ు డబ్బులో యాజమాన్య కాంట్రిబ్యూషన్‌కు సంబంధించిన 12ు నుంచి 8.33ు డబ్బును ఈపీఎ్‌ఫఓకు పంపిస్తారు. మిగతా 15.67 శాతాన్ని ఆర్టీసీ ఏర్పాటు చేసుకున్న పీఎఫ్‌ ట్రస్టులో జమ చేస్తారు. ఈ 15.67 శాతాన్ని ఉద్యోగి ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఈపీఎ్‌ఫఓలో జమ అయిన 8.33ు డబ్బు నుంచి రిటైరైన తర్వాత ఉద్యోగికి ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున పెన్షన్‌ రూపంలో చెల్లిస్తారు. ఈ పెన్షన్‌ను పొందడంపై ఆర్టీసీ మూడు రకాలుగా వెసులుబాటు కల్పించింది.


58 ఏళ్లు నిండిన ఉద్యోగి తనకు 58వ సంవత్సరం నుంచే పెన్షన్‌ కావానుకుంటే.. ఫామ్‌ 10-డీని డిపో మేనేజర్‌కు సమర్పించాలి. 58-60 ఏళ్ల వరకు రికవరీ అయిన పీఎఫ్‌ సొమ్మును 60 ఏళ్ల తర్వాత తీసుకోవచ్చు. 


ఉద్యోగి 58వ ఏట నుంచి పెన్షన్‌ వద్దనుకుని, 59వ ఏట నుంచి తీసుకుంటే, 58 నుంచి రావాల్సిన పెన్షన్‌ మొత్తానికి అదనంగా 4ు, 60 ఏట తీసుకుంటే అదే మొత్తానికి అదనంగా 8.16ు చెల్లిస్తారు. ఈ మధ్య కాలంలో రికవరీ చేసిన ఉద్యోగి పీఎఫ్‌ వాటాను ఫ్యామిలీ పెన్షన్‌ స్కీంలో జమ చేయరు.


ఉద్యోగి ఇప్పుడే పెన్షన్‌ వద్దనుకుని, 60 ఏళ్లకు రిటైరైన తర్వాత తీసుకుంటానంటే, ఈ రెండేళ్ల కాలంలో యాజమాన్యం వాటా కింద రికవరీ అయిన 12ునుంచి8.33ు సొమ్మును భవిష్యనిధికి జమ చేస్తారు. ఉద్యోగి పదవీ విరమణ సందర్భంగా ఆ రోజు వరకు ఉన్న సర్వీసును లెక్కించి పెన్షన్‌ను అందిస్తారు.


సీసీఎస్‌ డబ్బు చెల్లించండి ఆర్టీసీకి పాలకవర్గం డిమాండ్‌

ఆర్టీసీ ఉద్యోగులు కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎ్‌స)లో జమ చేసుకున్న రూ.900 కోట్లను వెంటనే చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని సీసీఎస్‌ పాలకవర్గం డిమాండ్‌ చేసింది. మూలవేతనంలో 7ు చొప్పున ప్రతి నెలా ఆర్టీసీ ఉద్యోగులు సీసీఎ్‌సలో జమ చేసుకుంటారని, ఈ సొమ్ము నుంచి రుణాలు తీసుకుంటారని పాలకవర్గం వివరించింది.


కానీ ఈ సొమ్మును రెండేళ్లుగా సీసీఎ్‌సకు బదలాయించకుండా ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంటుందని ఆరోపించింది. ఈ రూ.900 కోట్లు బదలాయించకపోవడంతో రుణాల కోసం ఉద్యోగులు పెట్టుకున్న 15 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. సీసీఎ్‌సకు రావాల్సిన సొమ్మును బదలాయించాలనే డిమాండ్‌తో బస్‌భవన్‌ ఎదుట ఈనెల 25న ధర్నా చేయాలని నిర్ణయించింది. అయితే పాలకవర్గంలోని కొంత మంది సభ్యులు వెనుకంజ వేస్తుండడంతో ఆరోజు ఆర్టీసీ ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇస్తామని సభ్యులు తెలిపారు.

Updated Date - 2020-09-23T09:28:06+05:30 IST