సమస్యలపై పోరాటానికి ఆర్టీసీ జేఏసీ

ABN , First Publish Date - 2021-06-22T09:15:05+05:30 IST

ఉద్యోగుల సమస్యలపై పోరాటానికి ఆర్టీసీలో 10 సంఘాలతో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) ఏర్పాటైంది.

సమస్యలపై పోరాటానికి ఆర్టీసీ జేఏసీ

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలపై పోరాటానికి ఆర్టీసీలో 10 సంఘాలతో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) ఏర్పాటైంది.  టీజేఎంయూ కార్యాలయంలో  నాయకులు  సోమవారం సమావేశమై జేఏసీ ని ప్రకటించారు. కమిటీ చైర్మన్‌గా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి, వైస్‌ చైర్మన్‌గా టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్‌, కన్వీనర్లుగా వీఎస్‌ రావు(ఎ్‌సడబ్ల్యూఎఫ్‌), పి.కమాల్‌రెడ్డి(ఎన్‌ఎం యూ), కో-కన్వీనర్లుగా జి.అబ్రహాం(ఎ్‌సడబ్ల్యూయూ), పి.రమే్‌షకుమార్‌(కార్మికసంఘ్‌), కె.యాదయ్య(బీకేయూ), ఎస్‌.సురే్‌ష(బీడబ్ల్యూయూ), బి.యాదయ్య(కార్మికపరిషత్‌), పి.హరికిషన్‌(ఎ్‌సటీఎంయూ)పేర్లను ప్రకటించారు. ఉ ద్యోగులపై పెరుగుతున్న పనిభారం, వేధింపులు, కొత్త బస్సుల కొనుగోలు, ఖా ళీల భర్తీ, 2017, 2021 వేతన సవరణలు, ఉద్యోగ భద్రత, 2013 పీఆర్సీ బాం డ్ల సొమ్ము చెల్లింపు, 4డీఏల అమలు, సీసీఎస్‌ పరిరక్షణ, ఎస్‌ఆర్‌బీఎస్‌ పెన్ష న్‌ తదితర సమస్యలపై పోరాడాలని జేఏసీ నిర్ణయించింది. పోరాట కార్యాచరణను రూపొందించుకోవడానికి మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించింది.

Updated Date - 2021-06-22T09:15:05+05:30 IST