ఆర్టీసీ బస్సులో సందడి చేసిన సజ్జనార్.. కుటుంబంతో కలిసి స్టెప్పులు

ABN , First Publish Date - 2021-12-02T15:51:49+05:30 IST

ఆర్టీసీ బస్సులో ఆ సంస్థ ఎండీ సజ్జనార్ సందడి చేశారు. కుటుంబంతో కలిసి బస్సులో స్టెప్పులు వేయడం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని ఆకట్టుకుంటోంది.

ఆర్టీసీ బస్సులో సందడి చేసిన సజ్జనార్.. కుటుంబంతో కలిసి స్టెప్పులు

హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో ఆ సంస్థ ఎండీ సజ్జనార్ సందడి చేశారు. కుటుంబంతో కలిసి బస్సులో స్టెప్పులు వేయడం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని ఆకట్టుకుంటోంది. ప్రజారవాణా ఆర్టీసీని తిరిగి లాభాల బాటలో పట్టించేందుకు ఎండీ సజ్జనార్ ఎన్నో కీలక మార్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సజ్జనార్ యూత్‌ని ఆకర్షించేందుకు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రమోట్ చేయడంలో భాగంగా సజ్జనార్ తన ఫ్యామిలీతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ టిక్‌టాక్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కుటుంబసమేతంగా సజ్జనార్ స్టెప్పులేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సు సురక్షితమని తెలియజేసేలా ఆయన సందేశాన్నిచ్చారు. సజ్జనార్ స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో సంస్థ మనుగడకు సజ్జనార్ చేస్తున్న పనులను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Updated Date - 2021-12-02T15:51:49+05:30 IST