Abn logo
Sep 24 2021 @ 19:05PM

90 దరఖాస్తులు పెట్టిన RTI కార్యకర్త దారుణ హత్య

పాట్నా: బిహార్ ప్రభుత్వ భూ ఆక్రమణలపై సమాచార హక్కు చట్టం కింద 90 దరఖాస్తులు వేసిన బిపిన్ అగర్వాల్ అనే సామాజిక కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఈ దారుణం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కొంత మంది అనుమానిత వ్యక్తులు మోటార్ సైకిళ్లపై వచ్చి బిపిన్‌ను తుపాకీతో కాల్చి చంపారట. నిందితులు ఎవరనేది ఇప్పటికీ గుర్తించలేదని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. నిజానికి కొద్ది రోజుల క్రితమే తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు అగర్వాల్. ఇంతలోనే ఈ దారుణం జరగడం గమనార్హం.

ఇవి కూడా చదవండిImage Caption