జిల్లా ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్‌ నిర్ధారణ కేంద్రం

ABN , First Publish Date - 2021-04-20T05:41:25+05:30 IST

సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో త్వరలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

జిల్లా ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్‌ నిర్ధారణ కేంద్రం
సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రీదేవి

సంగారెడ్డిలో త్వరలో ప్రారంభించనున్న అధికారులు

సంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 19: సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో త్వరలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ఆస్పత్రిలోని కుష్టు వ్యాధిగ్రస్తుల వార్డును ఎంపిక చేశారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు హైదరాబాద్‌లోని ఆయా ల్యాబ్‌ల నుంచి నిత్యం ఆలస్యంగా రావడంతో కేసుల పెరుగుదలకు కారణమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం ఎంపిక, తదితర వసతులు ఏర్పాట్లను సోమవారం ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ జి.గాయత్రీదేవి పరిశీలించారు. టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఈఈ రవీందర్‌రెడ్డి నేతృత్యంలో కేంద్రం ఏర్పాటు, పునరుద్ధరణకు కావాలసిన నిధుల మంజూరును కోరుతూ ప్రతిపాదనలు రూపొందించి సర్కారుకు నివేదించారు. నిర్ధారణ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ఎంపిక చేసిన ఇద్దరు వైద్యులు, ముగ్గురు ల్యాబ్‌ టెక్నిషియన్లు, డేటా ఆపరేటర్‌ను వారం రోజుల పాటు శిక్షణ నిమిత్తం హైదరాబాద్‌లోని నారాయణగూడ ఐపీఎంకు పంపారు. 

Updated Date - 2021-04-20T05:41:25+05:30 IST