Advertisement
Advertisement
Abn logo
Advertisement

రుద్రమదేవి వీరత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

ఘనంగా రాణీ రుద్రమదేవి వర్ధంతి 


నకిరేకల్‌, నవంబర్‌ 27: మహిళలు రుద్రమదేవి వీరత్వాన్ని, ధైర్యాన్ని పరిపాలన పటిమను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్‌ శ్రీరంగాచార్య అన్నారు. తెలంగాణ వీరవనిత రాణీ రుద్రమదేవి వర్ధంతిని శనివారం నకిరేకల్‌ మండలంలోని చందుపట్ల గ్రామంలో వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులోని రుద్రమదేవి మరణ శిలాశాసనం వద్ద పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీరంగాచార్య మాట్లాడుతూ కాకతీయుల వంశానికి వన్నె తెచ్చిన వీరనారి రాణి రుద్రమదేవి అని కొనియాడారు. రుద్రమదేవి మరణ శిలాశాసనం చందుపట్లలో ఉండటం వల్ల దేశ వ్యాప్తంగా చందుపట్లకు గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఇమడపాక లక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, నాయకులు బచ్చుపల్లి గంగాధర్‌రావు, మంగినపల్లి సాయి, యువజన మండలి అధ్యక్షుడు బెజవాడ నరేష్‌, వెంకటేశ్వర్లు, నాగరాజు, రాధాకృష్ణ, సందీప్‌, జాని, వెంకన్న,  నర్సింహారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement