పాత్రికేయులపై పాలకుల నీచ సంస్కృతి

ABN , First Publish Date - 2020-06-06T08:36:46+05:30 IST

స్థానిక ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట విలేకరులు బైఠాయించారు. రెండు గంటలపాటు ఆందోళన సాగింది.

పాత్రికేయులపై పాలకుల నీచ సంస్కృతి

జర్నలిస్టులు, ప్రజాసంఘాల ధ్వజం 


కళ్యాణదుర్గం: స్థానిక ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట విలేకరులు బైఠాయించారు. రెండు గంటలపాటు ఆందోళన సాగింది. జర్నలిస్టులు లింగప్రసాద్‌, మస్తాన్‌, చంద్రశేఖర్‌, హరినాథ్‌, రామకృష్ణ, నెపోలియన్‌, వన్నూరుస్వామి, ప్రజాసంఘాల నాయకులు తిప్పేస్వామినాయక్‌, శివశంకర్‌, ధనుంజయనాయక్‌, రాజానాయక్‌, ఆర్‌కే రాజు, గురుమూర్తి తదితరులు నిరసనకు మద్దతు తెలిపారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ కేసులు బనాయిస్తే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎక్సైజ్‌ సీఐ హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఓబులేసు, సురేంద్ర, ఎర్రిస్వామి, మల్లి తదితరులు పాల్గొన్నారు. 


కేసు బనాయించటం హేయం 

విలేకరి శంకర్‌నాయక్‌పై అక్రమ కేసు బనాయించటం హేయమైన చ ర్య అని రాయదుర్గం తహసీల్దార్‌కు విలేకరులు మహమ్మద్‌ అయూఫ్‌, ఈరన్న, మహబూబ్‌ బాషా, మనోహర్‌, గోపాల్‌, ఉమాశంకర్‌ వినతిపత్రం అందించారు. బొమ్మనహాళ్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పాత్రికేయులు ఓబులేసు, హనుమంతు, షేక్షావలి, జాకీర్‌, కరిబసప్ప పాల్గొన్నారు.


తాడిపత్రిలో..

తాడిపత్రి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ శ్వేతకు విలేకరులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యుజే జిల్లా ఉపాధ్యక్షుడు రంగనాయకులు, విలేకరులు గిరి, చంద్రమోహన్‌రెడ్డి, నాగరాజు, రమణ, నరేంద్రనాథ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రాజు, రాము, రామాంజి, ప్రసాద్‌, కల్యాణ్‌ పాల్గొన్నారు. విలేకరిపై అక్రమ కేసులకు నిరసనగా యల్లనూరు, పుట్లూరు, పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో విలేకరులు ఆందోళనలకు దిగారు. అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.


మడకశిరలో..

మడకశిర టౌన్‌: మడకశిర తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌కు విలేకరులు వినతిపత్రం అందజేశారు. పాత్రికేయులపై తప్పుడు కేసులు బనాయించి, ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో పాత్రికేయులు శ్రీనివాసులు, నాగరాజు, ఇర్ఫాన్‌, హరి, శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


చిలమత్తూరులో...

చిలమత్తూరు డిప్యూటీ తహసీల్దార్‌ హనుమంతుకు పాత్రికేయులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, మహేష్‌, రవీంద్రారెడ్డి, రామాంజి, బాలు, షామీర్‌, పవన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T08:36:46+05:30 IST