Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పాలకులు

బెల్లంపల్లి, డిసెంబరు 3: ప్రజాస్వామ్యాన్ని పాలకులు కూనీ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కలవేని శంకర్‌ అన్నారు. శుక్రవారం ప్రెస్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఏడు న్నర సంవత్సరాల కాలంలో ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని పేర్కొ న్నారు. కార్మిక, రైతు, విద్యుత్‌చట్టాలను తీసుకువచ్చి ప్రజా వ్యతిరేక పాలన  కొనసాగిస్తుందన్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా రైతు చట్టాలను వెనక్కి తీసుకుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. ఈనెల 6న సీపీఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నా మన్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన శిక్షణ తరగతులు పెద్దపల్లిలో నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వాలు అను సరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని సూచించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి రేగుంట చంద్రశేఖర్‌, రాష్ట్ర సమితి సభ్యులు చిప్ప నర్సయ్య, రామడుగు లక్ష్మణ్‌, పట్టణ కార్యదర్శి చంద్రమాణిక్యం, నాయకులు రాజేశం, లక్ష్మీనారాయణ, ప్రశాంత్‌, బాపు, బొంకూరి రాంచందర్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement