వలస కార్మికులను విస్మరించిన పాలకులు

ABN , First Publish Date - 2020-06-05T11:04:08+05:30 IST

వలస కార్మికులను పాలకులు విస్మరిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

వలస కార్మికులను విస్మరించిన పాలకులు

సుభాష్‌నగర్‌, జూన్‌ 4: వలస కార్మికులను పాలకులు విస్మరిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం విమర్శించారు. గురువారం వలస కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ వ్యవసాయ కార్మికసంఘం, సీఐటీయు, కెవీపీఎస్‌, రైతు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని,  కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేతులెత్తేశాయన్నారు.


వలస కార్మికులకు నెలకు పది వేల రూపాయలు ఇవ్వాలని, ఉపాధి కూలీలకు 200 పనిదినాలు కల్పించాలని, రోజుకు 600 రూపాయల కూలీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్ల రాజు, ఉపాధ్యక్షుడు రాయికంటి శ్రీనివాస్‌, సీఐటీయు జిల్లా, అధ్యక్ష, కార్యదర్శులు యు శ్రీనివాస్‌, ఎడ్ల ర మేశ్‌, కెవిపిఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు టి సురేశ్‌, సాగర్‌, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T11:04:08+05:30 IST