Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంపీడీఓపై అధికార పార్టీ నేత ఆగ్రహం

తూర్పు గోదావరి: ఎంపీడీఓపై అధికార పార్టీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చాంబర్‌లోనే దళిత ఎంపీడీఓపై  వైసీపీ నేత వాసంశెట్టి తాతాజీ ఏకవచనంతో రెచ్చిపోయారు. ఎంపీడీఓ నచ్చకపోతే పంపించేయండని అంటే సరిగ్గా చేయకపోతే చీరేస్తానని వైసీపీ నేత బెదిరించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వైసీపీలోని ఒక వర్గం టార్గెట్ చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీడీఓ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో కొంతమంది వైసీపీ నేతల మాట ఆమె దగ్గర చెల్లకపోవడంతో కొన్ని నెలలుగా ఎంపీడీఓపై నేతలు కక్ష్యగట్టి ఆరోపణలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. Advertisement
Advertisement