Abn logo
Oct 21 2021 @ 22:56PM

రూపే డేటా మరింత సేఫ్...

ముంబై : రూపే కార్డుల్లో డేటా ఇకపై మరింత సురక్షితంగా ఉండనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఈ క్రమంలో... ఏర్పాట్లు చేస్తోంది. మర్చంట్ల వద్ద కార్డు వివరాలను భద్రపరిచేందుకు ప్రత్యామ్నాయంగా ఈ వ్యవస్థను వినియోగిస్తారు. దీంతో కస్టమర్ల వివరాలకు మరింత గోప్యత, భద్రత ఉంటుంది. అలాగే కొనుగోళ్లు సులభమవుతాయి. ఎన్‌క్రిప్టెడ్ రూపంలో ఖాతాదారుల సమాచారాన్ని టోకెన్ రూపంలో భద్రపరచడంతోలావాదేవీలకు భద్రత ఏర్పడుతుంది. ఖాతాదారుల వివరాలను వెల్లడించకుండానే చెల్లింపు ప్రక్రియకు ఈ టోకెన్లు వీలు కల్పిస్తాయి. ఎన్‌పీసీఐ టోకెనైజేషన్ ప్రక్రియ నేపధ్యంలో... బ్యాంకులు, అగ్రిగేటర్లు, మర్చంట్లు, ఇతరులు ఎన్‌పీసీఐ వద్ద ధృవీకరణపత్రం పొందితే టోకెన్ రిక్వెస్టర్ పాత్రను పోషించవచ్చు.రూపే కార్డు వినియోగదారులు భవిష్యత్తులో చేసే లావాదేవీలకు ఈ అన్ని వ్యాపారవర్గాలు తమ రూపే ఖతాదారుల టోకెన్ రిఫరెన్స్ ఆన్‌ఫైల్ ను వినియోగించుకోవచ్చు. ఈ పారదర్శక వ్యవస్థ కారణంగా ఖాతాదారుల సమాచారం లీక్ కాదు. చెల్లింపు ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది. ఈ విధానంలో ఖాతాదారులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఎన్‌క్రిప్టెడ్ టోకెన్ రూపంలో నిల్వ ఉంటుంది. దీంతో షాపింగ్ చేసిన ప్రతిసారి కస్టమర్ వారి సమాచారం అందించే అవసరముండదు. అలాగే ఖాతాదారులకు సంబంధించిన సమాచారం పేమెంట్ ఇంటర్మీడియేటరీలు స్టోర్ చేసే వీలు ఉండదు.