పల్లెప్రగతి పనులను నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-09-19T09:57:23+05:30 IST

పల్లె ప్రగతి పనులను నెలాఖరు వరకు పూర్తిచేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు సూచించారు.

పల్లెప్రగతి పనులను నెలాఖరు వరకు పూర్తిచేయాలి

నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి


సిరికొండ/ధర్పల్లి, సెప్టెంబరు 18: పల్లె ప్రగతి పనులను నెలాఖరు వరకు పూర్తిచేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు సూచించారు. శుక్రవారం ఆయన సిరికొండ మండలం గడ్కోల్‌, సిరికొండ, ధర్పల్లి మం డలంలోని ఒన్నాజీపేట గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భం గా ఆయన ఆయా గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులను పరిశీలించారు. మొదట గడ్కోల్‌ గ్రామంలో చేపట్టిన వైకుంఠధామ నిర్మాణ పనులను చూసి కలెక్టర్‌ సంతృప్తిని వ్యక్తం చేసి అక్కడ మొక్క నాటారు. ఆ తర్వాత రైతువేది క నిర్మాణ పనులను పరిశీలించారు. రైతువేదిక, పల్లె ప్రకృతి వనాల పనుల ను నెలాఖరు వరకు పూర్తిచేయాలని సర్పంచ్‌ దేవాగౌడ్‌ను ఆదేశించారు. సిరికొండలో వైకుంఠధామాన్ని పరిశీలించిన కలెక్టర్‌ నీళ్లు నిల్వకుండా మట్టిని పోయించాలని సర్పంచ్‌ రాజారెడ్డికి సూచించారు. పల్లె ప్రకృతి వనాన్ని బా గా చేయించాలని సర్పంచ్‌కు సూచించారు. పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ వేయించాలన్నారు.


ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఒన్నాజీపేట గ్రామంలో చేపట్టిన పనులపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ముందు కూడా గ్రామంలో ఇదే పద్ధతిని కొనసాగించాలన్నారు. గ్రామం లో కొబ్బరి, పగోడ వంటి పెద్ద మొక్కలు నాటాలని, ఎలక్ర్టిక్‌ బోర్ల కింద లైన్‌ లకింద పూలమొక్కలు నాటాలని, గ్రామ శివారులో రోడ్డుకు ఇరువైపుల మొ క్కలు నాటాలన్నారు. ఉపాధి హామీలో వన సేవకులతో రోడ్డుకు ఇరువైపులా బుష్‌ కటింగ్‌ చేస్తున్న పనిని ప్రతీరోజు సమీక్షించాలన్నారు. పారిశుధ్య పను లు, ఉపాధి హామీ పనులపై ఆయన గ్రామ స్థాయి అధికారులను అడిగితె లుసుకున్నారు. రైతు వేదిక పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలావత్‌ సంగీత, జడ్పీటీసీ మాలావత్‌ మాన్‌సింగ్‌, ఎంపీటీసీ సభ్యులు రాజవ్వ, గంగారాం, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ మాలావత్‌ మంజుల, తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, ఎంపీడీవో లక్ష్మణ్‌, ఎంపీ వో లక్ష్మీప్రసాద్‌, నీటిపారుదల శాఖ ఏఈ సాయినాథ్‌, ఒన్నాజీపేట సర్పంచ్‌ భగవన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. సిరికొండ మండలంలోని గడ్కోల్‌, సిరికొండ గ్రామాల పరిఽధిలో ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన భూములను పట్టాదారులకు పం పిణీ చేయాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా వివరాలు తెలుసుకొని న్యాయం చేస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.


అలాగే.. హుస్సేన్‌నగర్‌ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న రైస్‌మిల్‌కు అ నుమతినివ్వద్దని స్థానిక యువకులు, మహిళలు రోడ్డుపై కలెక్టర్‌ నారాయణ రెడ్డిని అడ్డుకున్నారు. గడ్కోల్‌ నుంచి సిరికొండకు వెళ్తున్న కలెక్టర్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కొందరు మహిళలు, యువకులు ఆవేశంగా మాట్లాడగా కలె క్టర్‌ సైతం వారిపై ఆగ్రహించారు. నిబంధనల ప్రకారం లేకుంటే సీజ్‌ చేస్తా మని చెప్పారు.

Updated Date - 2020-09-19T09:57:23+05:30 IST