‘రూర్బన’ పథకం ప్రజావేదికలో అక్రమాలు బట్టబయలు

ABN , First Publish Date - 2021-10-22T06:40:26+05:30 IST

మండలంలో చేపట్టిన శ్యామ్‌ప్రసాద్‌ ము ఖర్జీ రూర్బన మిషన పథకం పనుల్లో అక్రమాలను సామాజిక తనిఖీ ప్ర జావేదిక నిగ్గుతేల్చింది.

‘రూర్బన’ పథకం ప్రజావేదికలో అక్రమాలు బట్టబయలు
మాట్లాడుతున్న రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఇందిరా ప్రియదర్శిని

సీసీ రోడ్ల నిర్మాణాల్లో రూ.1.48 కోట్లు,

నైపుణ్యాభివృద్ధి శిక్షణలో రూ.21.66 లక్షల అవినీతి

రికవరీకి సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆదేశం

ఎం-బుక్కులు సమర్పించని పనులపై మరోసారి సామాజిక తనిఖీ


కంబదూరు, అక్టోబరు21: మండలంలో చేపట్టిన శ్యామ్‌ప్రసాద్‌ ము ఖర్జీ రూర్బన మిషన పథకం పనుల్లో అక్రమాలను సామాజిక తనిఖీ ప్ర జావేదిక నిగ్గుతేల్చింది. గురువారం రూర్బన రాష్ట్ర కోర్డినేటర్‌ ఇందిరాప్రియదర్శిని అధ్యక్షతన స్థానికంగా అధికారుల బృందం ప్రజావేదిక నిర్వహిం చింది. విజిలెన్స అధికారి రమణారెడ్డి, అడిషనల్‌ పీడీ సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్‌ మేనేజర్‌ మేఘన సునీల్‌, రాష్ట్ర టీ మానిటరింగ్‌ అధికారి కోన య్య, ఎస్‌ఆర్పీ చంద్రమోహన, పంచాయతీరాజ్‌ డీఈ రాజన్న, ఎంపీడీఓ శివారెడ్డి హాజరయ్యారు. ఈపథకం కింద 2017-2021 ఏడాది వరకు ఖర్చు చేసిన నిధులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. 1145 పనులకు గాను 1010 పనులకు సంబంధించి ఎం-బుక్కులను సామాజిక తనిఖీ బృందానికి అందజేశారు. ఈపనులకు సంబంధించి రూ.32.56 కోట్ల నిధులు ఖ ర్చు చేశారు. ఇందులో 912 పనులను మాత్రమే క్షేత్రస్థాయిలో మండల ఇంజనీర్లు సామాజిక తనిఖీ బృందానికి చూపించారు. మిగిలిన 135 పనులకు సంబంధించి తనిఖీ బృందానికి ఎం-బుక్కులు అందజేయకపోవడంతో పనులను గుర్తించలేకపోయారు. సీసీ రోడ్లు, అంగనవాడీ భవనాలు, తాగునీటి పనులు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ తదితర పనులపై సామాజిక తనిఖీలు చేపట్టారు. 

       

ఇందులో నైపుణ్యాభివృద్ధి శిక్షణలో రూ.21.66 లక్షలు, సీసీ రోడ్ల కొలతల్లో తేడాలు రావడంతో రూ.1.48 కోట్లు రికవరీ చేయాలని అధికారు లు ఆదేశాలు జారీచేశారు. చాలాచోట్ల వేసిన రోడ్డు మీదే మరోసారి రోడ్డువేసి నిధులు దుర్వినియోగం చేసినట్లు సామాజిక తనిఖీ బృందం సభ్యు లు గుర్తించారు. దానికి తోడు ఒకే వర్క్‌ ఐడీని మరోసారి చూపించి నిధు లు కాజేసినట్లు తేల్చారు. తప్పుల తడకలు, అక్రమాలపై సంబంధిత మం డల ఇంజనీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంబదూరు పంచాయతీ పరిధిలోనే సుమారు రూ.6 కోట్లకు సంబంధించిన ఎం-బుక్కులు అందజేయలేకపోయారు. ఎం-బుక్కులను సంబంధిత మండల ఇంజనీర్లు సకాలంలో సా మాజిక తనిఖీ బృందానికి అందజేయకపోవడం పలు అనుమానాలకు దా రితీస్తోంది. దీంతో రెండోసారి సామాజిక తనిఖీ చేపట్టడానికి అధికారులు అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. 


Updated Date - 2021-10-22T06:40:26+05:30 IST