Advertisement
Advertisement
Abn logo
Advertisement

భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం

జంగారెడ్డిగూడెం టౌన్‌, నవంబరు 30: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. వేల సంఖ్యలో భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారన్నారు. తమలపాకులు, నాగవల్లి దళాలతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసన, వాహన పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయంలో వివిధ సేవల రూపంలో రూ. 7,90,540 ఆదయం సమకూరిందని ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టిన సిబ్బందిని ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు సరితా విజయ భాస్కర్‌రెడ్డి  అభినందించారు.

Advertisement
Advertisement