రష్యాలో గడిచిన 24 గంటల్లో 6,368 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-08T01:38:05+05:30 IST

రష్యాలో గడిచిన 24 గంటల్లో 6,368 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.

రష్యాలో గడిచిన 24 గంటల్లో 6,368 కరోనా కేసులు

మాస్కో: రష్యాలో గడిచిన 24 గంటల్లో 6,368 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో రష్యాలో మొత్తం కేసుల సంఖ్య 6,94,230కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 1,902 మందిలో ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. 82 ప్రాంతాల్లో మొత్తం కేసులు నమోదయ్యాయని.. ఇందులో రాజధాని మాస్కో నుంచి అత్యధికంగా 629 కేసులు బయటపడినట్టు ఆరోగ్యశాఖ చెప్పింది. క్రిమియా, రిపబ్లిక్ ఆఫ్ కామ్‌కియా, నెనెట్స్ అటానమస్ ఆక్‌రుగ్‌లలో ఒక్కకేసు కూడా నమోదు కాలేదని పేర్కొంది. మరోపక్క గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 198 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,494కు చేరింది. ఇక కరోనా నుంచి 24 గంటల్లో 9,551 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,63,880గా ఉంది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. ముందు మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, ఇండియా దేశాలున్నాయి. ఇటీవల కేసుల విషయంలో భారతదేశం రష్యాను దాటేసి మూడో స్థానానికి చేరింది.

Updated Date - 2020-07-08T01:38:05+05:30 IST