రష్యాలో ఒకేరోజు 16 వేలకు పైగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-21T05:50:01+05:30 IST

రష్యాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 16,319 కరోనా కేసులు నమోదైనట్టు

రష్యాలో ఒకేరోజు 16 వేలకు పైగా కరోనా కేసులు

మాస్కో: రష్యాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 16,319 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి రెస్పాన్స్ సెంటర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 14,31,635కు చేరుకుంది. మొత్తం 84 రీజియన్ల నుంచి ఈ కేసులు బయటపడినట్టు రెస్పాన్స్ సెంటర్ పేర్కొంది. రాజధాని మాస్కో నుంచే నిత్యం అత్యధిక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కొత్తగా నమోదైన 16,319 కేసుల్లో 4,664 మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదని రెస్పాన్స్ సెంటర్ తెలిపింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 269 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 24,635గా ఉంది. ఇక ఒకేరోజు 9,704 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఈ సంఖ్య 10,85,608కు చేరుకుంది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలున్నాయి. 

Updated Date - 2020-10-21T05:50:01+05:30 IST