రష్యాలో ఆగ‌ని కరోనా విజృంభణ.. 9 వేల కొత్త కేసులు

ABN , First Publish Date - 2020-05-31T12:36:41+05:30 IST

రష్యాలో కరోనా వైరస్‌ కొవిడ్‌-19 విజృంభణ ఏమాత్రం తగ్గలేదు. గత రెండు వారాలుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

రష్యాలో ఆగ‌ని కరోనా విజృంభణ.. 9 వేల కొత్త కేసులు

మాస్కో, మే 30: రష్యాలో కరోనా వైరస్‌ కొవిడ్‌-19 విజృంభణ ఏమాత్రం తగ్గలేదు. గత రెండు వారాలుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 8952 కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం నాటికి దేశంలో 4555 మంది మృతి చెందినట్టు కరోనా వైరస్‌ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,96,575కు చేరింది. ఇక, అమెరికాలో హాట్‌స్పాట్‌గా ఉన్న న్యూయార్క్‌ నగరంలో జూన్‌ 8 నుంచి దశలవారీగా సాధారణ కార్యకలాపాలకు అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, సింగపూర్‌లో శనివారం కొత్తగా 506 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 



Updated Date - 2020-05-31T12:36:41+05:30 IST