Omicron variantకు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్ వ్యాక్సిన్

ABN , First Publish Date - 2021-11-30T12:48:57+05:30 IST

కరోనా కొత్త వేరియెంట్ ఓమైక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది....

Omicron variantకు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్ వ్యాక్సిన్

మాస్కో(రష్యా): కరోనా కొత్త వేరియెంట్ ఓమైక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది.కొవిడ్ ఓమైక్రాన్ వేరియంట్‌ను లక్ష్యంగా చేసుకొని స్పుత్నిక్ వ్యాక్సిన్ యొక్క కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించినట్లు రష్యా దేశంలోని గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ తెలిపింది.స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌లు ఓమైక్రాన్ వేరియంట్‌ను తటస్థీకరిస్తాయో లేదో అధ్యయనం చేస్తున్నామని గమలేయా కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త స్పుత్నిక్ ఒమైక్రాన్ వెర్షన్ 45 రోజుల్లోనే భారీ ఉత్పత్తికి సిద్ధంగా ఉంటామని రష్యా ప్రకటించింది. 2022 ప్రారంభంలో స్పుత్నిక్ ఒమైక్రాన్ బూస్టర్ షాట్‌లు పెద్ద మొత్తంలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చని రష్యా భావిస్తోంది.


ఓమైక్రాన్ వేరియంట్ ప్రమాదం చాలా ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పరివర్తన చెందిన కరోనావైరస్ తీవ్ర పరిణామాలతో వ్యాప్తి చెందుతుందని డబ్లూహెచ్‌ఓ పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. దక్షిణాఫ్రికాలోని పరిశోధకులు వేరియంట్‌ని గుర్తించిన కొద్ది రోజులకే విదేశీ సందర్శకులందరి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. మొరాకో అన్ని ఇన్‌కమింగ్ విమానాలను నిషేధించింది. అమెరికా, యూరోపియన్ లతో సహా ఇతర దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులను నిషేధించాయి.వైరస్ భయపడినట్లుగా ప్రమాదకరమని రుజువైతే జనాభాపై దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. కాని ముఖ్యంగా తక్కువ టీకా కవరేజ్ ఉన్న దేశాల్లో ఓమైక్రాన్‌తో సంబంధం ఉన్న మరణాలు సంభవించలేదని డబ్లూహెచ్‌ఓ పేర్కొంది.




Updated Date - 2021-11-30T12:48:57+05:30 IST