పరిస్థితి చేయి దాటకమునుపే చర్చలు జరపండి: అఫ్గాన్ ప్రభుత్వానికి రష్యా సూచన

ABN , First Publish Date - 2021-07-15T02:29:30+05:30 IST

అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి చేయి దాటకమునుపే తాలిబన్‌లతో చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి జామిర్ కబూలోవ్ అఫ్గాన్ ప్రభుత్వానికి తాజాగా సూచించారు.

పరిస్థితి చేయి దాటకమునుపే చర్చలు జరపండి: అఫ్గాన్ ప్రభుత్వానికి రష్యా సూచన

కాబూల్: అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి చేయి దాటకమునుపే తాలిబన్‌లతో చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి జామిర్ కబూలోవ్ అఫ్గాన్ ప్రభుత్వానికి తాజాగా సూచించారు. చర్చల విషయంలో ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. చర్చలు జరుపుతామంటూ అఫ్గాన్ ప్రభుత్వం పలు మార్లు ప్రకటించినా..ఇప్పటివరకూ అది కార్యరూపం దాల్చలేదని ఆయన పేర్కొన్నారు. రష్యాతో పాటూ ఇతర దేశాలన్నీ కూడా మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకు సమ్మతించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాగా.. అఫ్గానిస్థాన్‌లో 85 శాతం భూభాగం తమ ఆధీనంలో ఉందని తాలిబన్‌లు ఇటీవలే ప్రకటించారు. అయితే..అఫ్గాన్ ప్రభుత్వం మాత్రం దీన్ని కొట్టి పారేసింది. ఇతరులపై దాడులు చేసేందుకు వేదికగా అఫ్గాన్‌ను మారనీయమని అఫ్గాన్ ప్రభుత్వం రష్యాకు హామీ ఇచ్చింది. 

Updated Date - 2021-07-15T02:29:30+05:30 IST