Abn logo
Sep 27 2021 @ 01:42AM

ఆ దంపతులు మనుషుల్ని చంపి.. ఏం చేసేవారంటే..

30 మంది అమాయకులని అమానుషంగా చంపినందుకు ఆ భార్యాభర్తలని రష్యా పోలీసులు అరెస్టు చేశారు. వారి ఇంట్లో నరికిన శవ భాగాలు దొరికాయని, అందుకే వారిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 


దిమిత్రీ బక్షీవ్(35), అతని భార్య నతాలియా(42) రష్యాలోని క్రాస్నొదర నగరంలో నివాసముంటున్నారు. అనుకోకుండా ఒక రోజు రోడ్డుపై ఒక మొబైల్ ఫోన్ పడి ఉండడంతో అది గమనించిన ఒక భవన కార్మికుడు అందులో ఫోటోలు చూశాడు. అందులోని ఒక ఫొటోలో దిమిత్రీ ఒక శవ భాగాన్ని తన నోట్లో పట్టుకొని ఉండడం చూసి అతను అశ్చర్యపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అనుమానంతో పోలీసులు దిమిత్రీ దంపతుల ఇంటిని సోదా చేయగా అక్కడ శవ భాగాలు దొరికాయి. 


పోలీసులు విచారణలో భయభ్రాంతులు కలిగించే నిజాలు బయటపడ్డాయి. దిమిత్రీ, అతని భార్య ఇద్దరూ కలిసి దాదాపుగా 30 మందిని నరికి చంపారని తెలిసింది. ఆ శవాలను చర్మం తీసి ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో నిలువచేసేవారని వారు ఒప్పుకున్నారు. మనిషి మాంసం రుచికి అలవాటు పడి ఈ దారుణాలు చేసేవారని తెలిసింది.


ఎక్కువగా యువతులను డేటింగ్ వెబ్‌సైట్ ద్వారా పరిచయం చేసుకొని, వారిని ఇంటికి పిలిచి భోజనం, డ్రింక్స్‌లో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చేవారని, ఆ తరువాత వారిని ముక్కలుగా నరికి చంపేవారని పోలీసులు చెప్పారు. దిమిత్రీ, అతని భార్య ఇంట్లో దాదాపు 19 మంది చర్మ నమూనాలు దొరికాయని పోలీసుల విచారణలో తేలింది. విచిత్రమేమిటంటే ఆ చనిపోయిన వారి మాంసంతో వంటలు చేసి హోటళ్లకు సరఫరా చేసేవారట.

ప్రత్యేకంమరిన్ని...