పెట్రోలియం జెల్లీతో బైసెప్స్ పెంచుకుని.. చావుకు దగ్గరలో..

ABN , First Publish Date - 2021-03-07T23:09:13+05:30 IST

వెర్రి వెయ్యిరకాలంటారు. అలాంటి వాటిలో ఒక రకం వెర్రి కండలు పెంచుకోవడం. అయితే ఇది ఆరోగ్య పరంగా, శరీర దారుఢ్యం పరంగా మంచిదైనా.. అది కష్టపడి సంపాదించుకోవాలి. కానీ కొంతమంది మాత్రం విచిత్రమైన..

పెట్రోలియం జెల్లీతో బైసెప్స్ పెంచుకుని.. చావుకు దగ్గరలో..

ఇంటర్నెట్ డెస్క్: వెర్రి వెయ్యి రకాలంటారు. అలాంటి వాటిలో ఒక రకం వెర్రి రష్యన్ ఫైటర్ కిరిల్ టెరెషిన్‌కు కూడా ఉంది. అదే తన చిన్నతనంలో చూసిన కార్టూన్ క్యారెక్టర్ పాపాయ్‌లాంటి చేతులు తెచ్చుకోవడం. దానికోసం ఓ ప్రయోగం చేశాడు. తన బైసెప్స్‌లోకి పెట్రోలియం జెల్లీని ఎక్కించుకుని వాటి సైజును భారీగా పెంచుకున్నాడు. ఎలాగైతేనేం తనకు కావలసిన బైసెప్స్ తెచ్చుకున్నాడు. కానీ కొన్నాళ్లకు మొదలైంది అసలు సమస్య. కిరిల్ టెరెషిన్.. రష్యాలోని ఎంఎంఏ ఫైటర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే తన ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ ‘పోపాయ్‌’లా మారాలని పెట్రోలియం జెల్లీత ో బైసెప్స్ సైజు భారీగా పెంచుకున్నాడు. అది కూడా ఒకటి, రెండు అంగుళాలు కాదు.. ఏకంగా 24 అంగుళారు.


కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత అసలు సమస్యలు మొదలయ్యాయి. లోపలి పెట్రోలియం జెల్లీ గడ్డకట్టిపోయింది. కండరాలు కదుములు కట్టేశాయి. దీంతో చేతులు ముడిచేందుకు కూడా ఇబ్బందిగా మారింది. ఇక తను చేసిన తప్పు తెలుసుకుని గతేడాది డాక్టర్లను ఆశ్రయించాడు కిరిల్. కానీ కరోనా దెబ్బకు సర్జరీ చేయడం సాధ్యపడలేదు. అయితే ఎట్టకేలకు డాక్టర్ల అతడి సర్జరీకి ఇప్పుడు ఏర్పాట్లు పూర్తి చేశారు. 


త్వరలో సర్జరీ చేసి మొత్తం జెల్లీని, చనిపోయిన లేదా గడ్డకట్టిన కండరాలను తొలగించనున్నారు. ఈ క్రమంలో 24 ఏళ్ల కిరిల్ మాట్లాడుతూ, 20ఏళ్ల వయసులో ఓ చెత్త పని చేశానని, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నానని వాపోయాడు. సర్జరీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, కానీ దీనిని మొత్తంగా తొలగించకపోతే తాను చనిపోయే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. 

Updated Date - 2021-03-07T23:09:13+05:30 IST