10వేల ఏళ్లనాటి మెమూత్ శిలాజాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2020-08-05T01:27:06+05:30 IST

వేల ఏళ్లనాటి జంతువులు, మనుషుల శిలాజాల కోసం పురావస్తు శాస్త్రవేత్తలు అహర్నిశలూ అన్వేషిస్తూనే ఉంటారు. ఆ అన్వేషణలో...

10వేల ఏళ్లనాటి మెమూత్ శిలాజాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

మాస్కో: వేల ఏళ్లనాటి జంతువులు, మనుషుల శిలాజాల కోసం పురావస్తు శాస్త్రవేత్తలు అహర్నిశలూ అన్వేషిస్తూనే ఉంటారు. ఆ అన్వేషణలో భాగంగా కొన్నిసార్లు నమ్మశక్యంకాని ఆధారాలు వారికి లభిస్తూ ఉంటాయి. ఇటీవల సైబీరియన్ నదిలో జరిపిన పరిశోధనల్లో దాదాపు 10 వేల ఏళ్లనాటి మెమూత్(మంచు ఏనుగు)ను రష్యన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తొలుత స్థానికులు గుర్తించారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో రెండు చోట్ల తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో మెమూత్‌కు సంబంధించిన 90 శాతం శరీర భాగాలను సేకరించగలిగామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ శిలాజం దాదాపు 10వేల ఏళ్లనాటి మగ మెమూత్ అని, దీని వయసు 15 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండే అవకాశం ఉందని, 10 అడుగుల ఎత్తు ఉండి ఉండొచ్చని వెల్లడించారు.

Updated Date - 2020-08-05T01:27:06+05:30 IST